చెరుకురసం: తాగేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..

-

వేసవిలో శీతల పానీయాలకి గిరాకీ ఎక్కువ ఉంటుంది. మండే సూర్యుడు శరీరంలోని నీటిని లాగేసుకుంటాడు కాబట్టి, ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తూ ఉండాలి. లేదంటే శరీరంలో నీరు తగ్గిపోయి నిర్జలీకరణానికి గురై అస్వస్థత కలుగుతుంది. అందుకే నీటి విషయంలో అశ్రద్ధ వహించకూడదు. శీతల పానీయాలకి ఎక్కువ గిరాకీ ఉన్న ఈ సమయంలో అందరూ ఎక్కువగా తాగాలని చూసేది చెరుకు రసం అని చెప్పవచ్చు. చెరుకులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కాబట్టి, దాన్ని తాగడానికి ఇష్టపడతారు.

చెరుకురసం ఆరోగ్యానికి మంచిదే. కానీ దాన్ని తీసుకునే విధానం మంచిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అవును, చెరుకు రసాన్ని తీసుకునే విధానం బాగాలేకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం చెరుకు రసాన్ని ఎలా తాగాలి? ఎలాంటి ప్రదేశాల్లో తాగాలి? సహా అనేక విషయాలు తెలుసుకుందాం.

క్రషర్ లో చెరుకును కడగకుండా పెట్టడం మంచిది కాదు. దానివల్ల హానికరమైన బాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. ఎప్పుడైనా చెరుకుని కడగకుండా క్రషర్ లో పెట్టడం గమనిస్తే రసం తాగకపోవడమే మంచిది. అదీగాక తాజాగా ఉన్న చెరుకు రసాన్నే తాగండి. చెరుకు రసం తీసిన పదిహేను నిమిషాల తర్వాత ఆక్సీకరణం చెందుతుంది. అందుకే తాజాగా చెరుకు బండి వద్ద మాత్రమే తాగాలి. పార్శిల్ తీసుకెళ్ళడం వల్ల దానిలో ఉండే పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది.

చేతితో ముట్టకుండా డైరెక్టుగా క్రషర్ లో నుండి వచ్చే చెరుకురసాన్ని తాగడమే మంచిది. ఒకరోజులో ఎక్కువసార్లు చెరుకురసాన్ని తాగరాదు. అతి అంతటా అనర్ధమే కాబట్టి మితంగానే తీసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న చెరుకు బండి వద్ద చెరుకు రసం తాగవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news