కావలసినవి :
మినపపప్పు : 1 కప్పు
బియ్యం : 1 టేబుల్‌స్పూన్
అల్లం : 1 పీస్
నీరు : 2 టేబుల్‌స్పూన్లు
ఉల్లిముక్కలు : కప్పు
పచ్చిమిర్చి : 3
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : తగినంత
జీలకర్ర : 1 టీస్పూన్
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
పెరుగు లేదా మజ్జిగ : సరిపడా.
తయారీ :
ముందుగా మినపప్పు, బియ్యాన్ని మూడు గంటల వరకు నానబెట్టాలి. ఆ తర్వాత మినపప్పును బాగా కడిగి మిక్సీ జార్‌లో తీసుకోవాలి. అందులో అల్లం ముక్కలు నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టించాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకోని బాగా కలుపాలి. వడలు చేసుకునేలా పిండి కలుపుకోవాలి. ఇందులో ఉల్లిముక్కుల, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపాలి. వేరొక బౌల్‌లోకి కొంచెం మజ్జిగ లేదా పెరుగులోకి నీరు జోడించి తీసుకోవాలి. తర్వాత పిండిని ఉండల్లా చేసుకొని కవర్ మీదైనా, కాటన్‌బట్ట మీద అయినా వడల్లా చేసుకోవాలి. తర్వాత మరుగుతున్న నూనెలో వడలు వేసి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు అటుఇటూ తిప్పుతూ ఉండాలి. ప్లేట్‌లో టిష్యూ పెట్టి సర్వ్ చేసుకుంటే వడల్లో ఉండే నూనెను లాగేస్తుంది. ఇక అంతే వడలను సాంబార్, చట్నీతో తీసుకుంటే ఆహా అనాల్సిందే.