వేసవిలో మామిడి పండ్లు ఈ సమయంలో తింటేనే మంచిది..!

-

మామిడి పండ్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు..? ప్రతి ఒక్కరికి కూడా మామిడి పండ్లు అంటే ఎంతో ఇష్టం. వేసవి వచ్చిందంటే చాలు రకాల మామిడి పండ్లను కొనుగోలు చేసి వాటి యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఉంటాం. మామిడి పండ్ల గురించి ఆరోగ్య నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మామిడి పండ్లు బాగా ఉపయోగపడతాయి.

 

ఇందులో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే బాగా జీర్ణం అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అయితే వేసవి కాలం లో సరిగ్గా మామిడి పండ్లు తీసుకోవడం సరైన సమయంలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మామిడి పండ్లు తినడానికి అసలు భయపడకండి. ఈ టిప్స్ ని ఫాలో అవమని ఆరోగ్యనిపుణులు చెప్పారు. అలానే బరువు పెరిగి పోతానేమో అన్న భయం ఉన్న వాళ్లు కూడా ఈ టిప్స్ ని ఫాలో అవడం మంచిది. మామిడి పండ్లలో ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి.

అలానే ఇది మంచి ఎనర్జీ ఇస్తుంది. అయితే ఎప్పుడైనా మామిడి పండ్లతో డెసర్ట్ చేసుకున్నట్లయితే ఆహారం తీసుకునే సమయంలో వాటిని తీసుకోవద్దు. మీరు మామిడి పండ్లు ఎప్పుడూ కూడా మీల్ కి మీల్ కి మధ్యలో స్నాక్స్ కింద తీసుకోవడం మంచిది. ఉదయం 11 గంటలకి కానీ సాయంత్రం నాలుగు గంటలకి కానీ మామిడి పండ్లు తీసుకోండి అని ఆమె చెబుతున్నారు.

ఎప్పుడు కూడా మామిడి పండ్లను ఈ సమయంలో తినొద్దు:

బాగా రాత్రి అయినప్పుడు మామిడి పండ్లను తీసుకోవద్దు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఎప్పుడూ కూడా బాగా రాత్రి పూట డిన్నర్ అయిన తర్వాత మామిడి పండ్లను తినకండి.

వేసవికాలంలో ఆమ్రస్ ని ఎలా ఎంజాయ్ చేయండి:

మామిడి పండ్లతో సులభంగా ఆమ్ రస్ ని మనం తయారు చేసుకోవచ్చు.
మామిడి పండు యొక్క గుజ్జుతో దీనిని తయారు చేస్తారు. అలాగే యాలుకలు, కుంకుమపువ్వు. పంచదార కూడా ఇందులో వేస్తారు.
వేసవికాలంలో మామిడి పండ్లను ఇలా తీసుకోవచ్చు.
స్నాక్స్ కింద మిల్ కి మిల్ కి మధ్యలో తీసుకోవడం మంచిది.
అలానే బ్రేక్ఫాస్ట్ సమయంలో ఈ పండ్లు తీసుకోవచ్చు లేదంటే జ్యూస్ వంటివి తీసుకోవచ్చు.
మిగిలిన పండ్ల తో పాటు మామిడి పండ్లను కూడా సలాడ్ కింద కూడా చేసుకుని తీసుకోవచ్చు.

 

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news