చేపల్లో బొమ్మిడాయి చేపలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిని ఎలా వండుకు తిన్నా రుచికరంగానే ఉంటాయి. చాలా మంది వీటితో పులుసు లేదా వేపుడు చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలోనే బొమ్మిడాయిల వేపుడు ఎలా చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
బొమ్మిడాయిల వేపుడుకు కావల్సిన పదార్థాలు:
బొమ్మిడాయి చేప ముక్కలు – 12
ఉప్పు – తగినంత
నూనె – 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 5
పసుపు – అర టీస్పూను
కారం – 2 టీస్పూన్లు
ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూను
కొబ్బరి పేస్ట్ – అర కప్పు
గరం మసాలా – 1 టీస్పూను
కొత్తిమీర – తగినంత
నీళ్లు – 3 కప్పులు
బొమ్మిడాయిల వేపుడు తయారీ విధానం:
గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాత్రలో నూనే పోసి వేడెక్కాక.. అందులో చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తర్వాత కొబ్బరి పేస్ట్, కొత్తిమీర, నీళ్లు వేసి నెమ్మదిగా కలపాలి. మరిగాక స్టౌ మంట తగ్గించాలి. అలాగే మూత ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు కూర చిక్కబడే వరకు ఉడికించాలి. దీంతో బొమ్మిడాయిల వేపుడు రెడీ అవుతుంది..!