ఒకప్పుడు తాము కరెంట్ లేకుండానే జీవించామని, అయితే ఇప్పుడు కూడా దాని అవసరం తనకు లేదని, ఇలా పూరింట్లో పచ్చని చెట్ల మధ్య, పక్షులతో కలసి జీవించడం అంటే తనకు ఎంతో ఇష్టమని డాక్టర్ హేమా చెబుతోంది.
సాధారణంగా మనకు ఒక పూట కాదు కదా.. ఒక్క నిమిషం కరెంటు లేకపోతేనే విసుగు వస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఒక్క సెకను కూడా కరెంటు లేకుండా ఉండలేం. ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే కరెంటు లేకపోతే మన పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆ మహిళ గత 79 ఏళ్లుగా కరెంటు లేకుండానే జీవిస్తోంది.. తెలుసా..? మరి ఆమె ఏమనాలి..? అయితే ఆ మహిళ ఉండే ఇంటికి కరెంట్ కట్ చేశారా..? లేదా అక్కడసలు కరెంటే లేదా..? లేదా పవర్ కట్స్ ఉంటాయా..? అంటే.. అవేవీ కావు. కానీ.. ఆమె కరెంటు వద్దనుకునే అప్పటి నుంచి జీవిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు, ఏంటామె కథ.. అంటే…
ఆమె పేరు డాక్టర్ హేమా సనే. రిటైర్డ్ ప్రొఫెసర్.. కానీ చూస్తే ఆమె అలా అనిపించదు. ఈమె పూణెలోని బుధ్వార్‌పెత్‌లో ఉంటుంది. వయస్సు 79 ఏళ్లు. సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ నుంచి బోటనీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఆ తరువాత కొన్నేళ్ల పాటు కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. అయితే ఈమెకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. అందుకనే చిన్నప్పటి నుంచి ఈమె విద్యుత్‌ను వాడడం లేదు. స్కూల్, కాలేజీ రోజుల్లో ఒకప్పుడు విద్యుత్ సదుపాయం లేకుండానే ఆమె చదివింది. అది అలాగే కొనసాగింది. అలాగే ఆమె పీహెచ్‌డీ చేసిన రోజుల్లో కూడా లాంతరు వెలుగులోనే చదువు కొనసాగించింది. అంతేకానీ.. విద్యుత్‌ను వాడలేదు.
ఒకప్పుడు తాము కరెంట్ లేకుండానే జీవించామని, అయితే ఇప్పుడు కూడా దాని అవసరం తనకు లేదని, ఇలా పూరింట్లో పచ్చని చెట్ల మధ్య, పక్షులతో కలసి జీవించడం అంటే తనకు ఎంతో ఇష్టమని డాక్టర్ హేమా చెబుతోంది. కరెంటు లేకుండా, ఫోన్లు వాడకుండా, ఫ్యాన్ తదితర ఎలక్ట్రిక్ పరికరాలు లేకుండా ఎలా ఉంటున్నావని తనను చాలా మంది అడుగుతారని, అయితే తనకు ఇలా ఉంటేనే ఇష్టమని ఆమె అంటోంది. అయితే డాక్టర్ హేమాకు నిజానికి పూరింట్లో ఉండడమే ఇష్టం. రాత్రి పూట వెలుగుకు ఆమె లాంతరు వాడుతుంది. అయితే ఆమె గురించి తెలిసి వారు ఆమెను చెత్తలో బతుకుతుంది అంటారట. కానీ ఆమె అవేవీ పట్టించుకోదు. అందుకనే తాను ఇతరుల ఇండ్లకు కూడా వెళ్లనని ఆమె చెబుతోంది.
ఇక డాక్టర్ హేమా బోటనీ, పర్యావరణంపై ఎన్నో పుస్తకాలను కూడా రాసింది. అవి ప్రస్తుతం మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈమె ఎన్నో కార్యక్రమాల్లో ప్రసంగాలను కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకు తెలియని పక్షి, చెట్లు లేవంటే చాలా మంది నమ్మరు. ఈ క్రమంలో ఇప్పటికీ డాక్టర్ హేమా ఖాళీగా ఉన్న సమయంలో పుస్తకాలను రాస్తుందట. రాత్రి పూట అయితే వెలుగుకు ఆమె లాంతర్‌ను ఉపయోగిస్తుంది. ఏది ఏమైనా.. ప్రకృతి, పర్యావరణం పట్ల ఆమె చూపుతున్న ప్రేమకు నిజంగా మనం ఆమెను అభినందించాల్సిందే కదా..!