ఆలూ తో గుమగుమలాడే పులావ్..

-

ఆలు తో ఏం చేసిన కూడా చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా స్నాక్ ఐటమ్స్ చేసుకుంటారు.అయితే వెరైటీగా కావాలని అనుకునేవారికి మాత్రం ఆలూ పులావ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పులావ్ ను సింపుల్ గా ఎలా చేసుకోవాలో చుద్దాము..

కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు
బేబీ ఆలూ – 10
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టేబుల్‌ స్పూన్లు
పెరుగు – అర కప్పు
కారం – ఒక చెంచా
ధనియాల పొడి – రెండు చెంచాలు
గరం మసాలా – చెంచా
పుదీనా తరుగు – పావు కప్పు
కొత్తిమీర తరుగు – పావు కప్పు
పచ్చి మిర్చి – రెండు
అనాస పువ్వు – ఒకటి
బిర్యానీ ఆకు – ఒకటి
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
దాల్చిన చెక్క – ఒకటి
నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌
నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు_సరిపడా

తయారీ విధానం:

ముందు ఆలుపై తొక్క తీసి నీటిలో కాస్త ఉప్పు వేసి పెట్టుకోవాలి.పెరుగులో కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఆలూ వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లం వెల్లల్లి ముద్ద వేయించి నిలువుగా తరిగిన పచ్చి మిర్చి వేసి పెరుగు, కొత్తమిర, పుదీనా తరుగు వేసి అన్నింటినీ కలపాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆలూ, రెండు కప్పుల నీళ్ళు పొయాలి.తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి మూత పెట్టాలి. అన్నం పూర్తిగా ఉడికాక దింపేయాలి. దీంతో వేడి వేడి ఆలు పులావ్‌ రెడీ అవుతుంది. ఇలానే తిన్నా బాగుంటుంది. లేదా పెరుగు చట్ని తో తిన్నా బాగుంటుంది. లేదా సవర్మా, చికెన్ కర్రీ వేసుకొని తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news