మీకోసం 7 రకాల హెల్తీ స్నాక్స్: తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పనులు చేయించుకుంటుంది. అయితే ఇంటికే పరిమితమైన వాళ్లకు చిరు తిళ్లు తినాలని ఎంతో ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి స్నాక్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం అనేది తెలిసి ఉండాలి. అందుకే మేము మీకోసం 7 రకాల హెల్తీ స్నాక్స్ గురించి చెప్పబోతున్నాం. అయితే కరోనా విజృంభిస్తున్న సమయంలో ఫుల్ సేఫ్‌డ్, ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.

గూయ్ ఫిల్‌డ్ కుకీస్
గూయ్ ఫిల్‌డ్ కుకీస్

గూయ్ ఫిల్‌డ్ కుకీ(Gooey Filled Cookie)..
గూయ్ ఫిల్‌డ్ కుకీస్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వినియోగదారుల టేస్ట్‌కు తగ్గట్లు ఈ కుకీస్‌లను తయారు చేశారు. శరీరంలో రోజువారీ ప్రోటీన్ పెంచడానికి గూయ్ ఫిల్‌డ్ కుకీస్ ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. 20 గ్రాముల వరకు ప్రోటీన్ నిండి ఉంటుంది. వీటిని రుచికరమైన రిచ్‌డౌతో కాలుస్తారు. ఆకలి వేసినప్పుడు వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

మణియర్స్ ఖఖ్రా
మణియర్స్ ఖఖ్రా

మణియర్స్ ఖఖ్రా (Maniarrs Khakhra)..
గో టు గుజరాతీ చిరుతిండి మణియర్స్ ఖఖ్రాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. సుగంధ ద్రవ్యాలు, బహుళ రుచులు, రకరకాల స్పెసెస్‌లో వీటిని తయారు చేస్తారు. ఇందులో 8 రకాల కాంబో ప్యాక్‌లు ఉన్నాయి. రుచికి తగ్గట్లు మణియర్స్ ఖఖ్రా స్నాక్స్ ఉంటాయి.

6 లేయర్డ్ ప్రోటీన్ బార్
6 లేయర్డ్ ప్రోటీన్ బార్

మై ప్రొటీన్ 6 లేయర్డ్ ప్రోటీన్ బార్ (Myprotein 6 Layered Protein Bar)..
మై ప్రోటీన్‌కు చెందిన 6 లేయర్డ్ ప్రోటీన్ బార్ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ బార్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటి వంటి ఆరు లేయర్లతో తయారు చేయబడింది. ఇందులో 20 గ్రాముల ప్రోటీన్, పోషకాలు, కాల్షియం ఉంటుంది. దీన్ని చూడగానే నోరూరుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్‌ను ఉపయోగించండి.

గ్రామింగ్‌వే రాగి డైట్ చిప్స్
గ్రామింగ్‌వే రాగి డైట్ చిప్స్

గ్రామింగ్‌వే రాగి డైట్ చిప్స్ (Grammingway Ragi Diet Chips)
ఇప్పటివరకు బంగాళాదుంప చిప్స్, బనానా చిప్స్ చూసి ఉంటారు. వీటి వల్ల టేస్ట్ ఉన్నా.. కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. కానీ గ్రామింగ్‌వే రాగి డైట్ చిప్స్ రాగి పిండితో తయారు చేస్తారు. వీటిలో అవసరమైన మసాలా దినుసులు వాడుతారు. స్పైసీగా, క్రంచీగా ఈ స్నాక్స్ ఉంటాయి.

గ్రీన్ స్నాక్ కో
గ్రీన్ స్నాక్ కో

గ్రీన్ స్నాక్ కో (The Green Snack Co)
గ్రీన్ స్నాక్ కో ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం. క్వినోవా, కాలే ఆకులు, సూపర్ గ్రెయిన్స్‌తో దీనిని తయారు చేస్తారు. బ్రాండ్ పఫ్స్, క్రిస్ప్స్, స్టిక్స్ ఇలా చాలా రకాలు గ్రీన్ స్నాక్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

కీరోస్ స్నాక్ ప్యాక్ (Keeros Snack Pack)..
కీరోస్ స్నాక్ ప్యాక్ చాలా ఆదరణ పొందిన చిరుతిండి. ఇందులో అధికంగా ఫైబర్, పోషక విలువలు ఉంటాయి. దీంతో ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి కీరోస్ స్నాక్స్ మంచి ఆహారం.

ది హెల్తీ క్రావింగ్స్ కో రోస్టెడ్ మక్కానా (The Healthy Cravings Co Roasted Makhana)..
మక్కానాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ స్నాక్స్‌లో ప్యాట్ కంటెంట్ కూడా ఉండదు. పనిలో ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు ది హెల్తీ క్రావింగ్స్ కో రోస్టెడ్ మక్కానాను తీసుకోవచ్చు. ఖాళీ సమయాల్లో ఆకలి వేసినప్పుడు ఈ స్నాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈ స్నాక్స్ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.