సాయంత్రం స్నాక్స్: ఐదు నిమిషాల్లో తయారయ్యే కాఫీ కుకీస్.. తయారు చేసుకోండిలా..

-

లాక్డౌన్ కారణంగా పనులన్నీ ఇంటి నుండే జరుగుతున్నాయి. పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం అయ్యే వరకు కంప్యూటర్ ముందు కూర్చుని కూర్చుని అలసిపోతున్నారు. ఇలా కూర్చోవడమే ఇబ్బందిగా ఉందంటే, నైట్ షిఫ్ట్ ఇంకా ఇబ్బందిగా మారుతుంది. ఇంట్లో ఉంటూ రాత్రివేళల్లో పనిచేయాలంటే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. ఇలాంటి చిరాకు సమయంలో నోటికి రుచిగా ఏదైనా స్నాక్స్ తగిలితే కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ స్నాక్స్ కాఫీ కుకీలైతే ఆ మజానే వేరు.

ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి రిలాక్స్ అవుదామనుకుని కాఫీ కుకీలని తీసుకున్నా, సాయంత్రం పని మొదలెట్టాలని అనుకున్నప్పుడు ప్రారంభంలో మంచి ఉత్తేజం కోసం కాఫీ కుకీలని తీసుకున్నా బాగుంటుంది. అందుకే ఐదు నిమిషాల్లో తయారయ్యే కాఫీ కుకీలని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

1- గుడ్డు పచ్చసొన
2టేబుల్ స్పూన్ బెల్లం
1టేబుల్ స్పూన్ కోకో పౌడర్
1టేబుల్ స్పూన్- పీనట్ బటర్
కొన్ని చాక్లెట్ చిప్స్

చిన్న పాత్ర తీసుకుని అందులో గుడ్డు పచ్చసొన, బెల్లం, పీనట్ బటర్, కలిపి పొయ్యి మీద ఉంచాలి. అందులో ఉండే పదార్థాలు కొద్దిగా వేడిగా ఉంచి అప్పుడు కోకో పౌడర్ కలపాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుని మిశ్రమాన్నంతా కుకీల రూపంలో ఉంచాలి. అపుడు చాక్లెట్ చిప్స్ ని కుకీల మీద చల్లాలి. ఐదు నిమిషాల పాటు ఓవెన్ లో ఉంచి వేడి వేడిగా బయటకు తీసి ఆరగించండి.

మీ ఇంట్లో ఒకసారి ప్రయత్నించి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news