కష్టడ్‌ కేక్..పంచదార, నెయ్యి లేకుండానే సూపర్‌ టేస్ట్‌..!

-

కేక్‌ అంటే చిన్నపిల్లలు ఎగిరి గంతేస్తారు. ఎంత పెట్టినా సరే ఇష్టంగా తింటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటిల్లో షుగర్‌, మైదాపిండి ఎక్కువగా వేస్తారు. మనం ఇంట్లోనే హెల్తీగా షుగర్‌ లేకుండా కేకులు చేస్తే..అంతే టేస్ట్‌తో సూపర్‌ లుక్‌ ఉంటాయి. కష్టడ్‌ కేక్‌ను ఎలా చేయాలో చూద్దామా..!

కష్టడ్‌ కేక్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మల్టీగ్రెయిన్‌ పిండి ఒకటిన్నర కప్పు
తేనె ఒక కప్పు
పాలు అరకప్పు
కష్టడ్‌ పౌడర్‌ రెండు టేబుల్‌ స్పూన్‌
పెరుగు టూ టేబుల్‌ స్పూన్
దాల్చిన చెక్కపొడి ఒక టీ స్పూన్
బాదంముక్కలు చిన్నగా కట్‌ చేసినవి ఒక టీ స్పూన్
పిస్తా చిన్నముక్కలు ఒక టేబుల్‌ స్పూన్
బేకింగ్‌ సోడా కొద్దిగా
బేకింగ్‌ పౌడర్‌ కొద్దిగా

తయారు చేసే విధానం..

బౌల్‌ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్‌ పిండి, కష్టడ్‌ పొడి వేయండి. అందులోనే బేకింగ్‌పౌడర్, వంటసోడా, దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేయండి. వీటన్నింటిని బాగా కలపండి. స్మూత్‌ రావడం కోసం పుల్లపెరుగు వేయండి. తేనె కూడా వేయండి. చాలామంది పంచదార వాడతారు. కానీ మనం తేనె వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పాలతో వీటన్నింటిని బాగా మిక్స్‌ చేయండి. ఉండలు లేకుండా చూసుకోండి. పిండి రెడీ అవుతుంది.

కేక్‌ ట్రే తీసుకుని అందులో మీగడ రాసి ఈ కేక్‌ పిండిని వేయండి. పైన డ్రసింగ్ కోసం బాదం, పిస్తా ముక్కలు కట్‌ చేసుకుని వేసుకోండి. కేక్‌ ట్రేను మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున రింగ్ పెట్టి పైన ఈ కేక్‌ ట్రే పెట్టండి. 30నిమిషాలు బేక్‌ చేయండి. అంతే కలర్‌ఫుల్‌గా ఉండే టేస్టీ కేక్‌ రెడీ.! ఒవెన్‌ లేకున్నా సరే..మెత్తగా ఉండే కష్టడ్ కేక్‌ రెడీ.. పిల్లలకు బయట దొరికే అన్‌హెల్తీ కేక్స్‌ పెట్టకుండా ఇలాంటివి ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, ఇంకా వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.! ఓసారి మీరు ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news