మ్యాంగోతో ఐస్ క్రీమ్.. సింపుల్ గా టేస్టీగా ఇలా చేసేయండి..!

-

సమ్మర్ అంటే మ్యాంగో సీజన్. కొంతమంది ఏమో.. పెరుగు అన్నంలో తింటారు. ఇంకొందరు.. మామిడి తింటే.. వేడి చేస్తుందని అసలు వాటి జోలికి పోరు. ఇంకొంతమంది అది తింటుంటే… మూతినిండా అంటుంది..అది అంతా నచ్చక కూడా మామిడి పండ్లను దూరంపెడతారు. అలాంటి వారికోసం.. మ్యాంగోతో పెరుగు కలిపి అమర్ కంద్ చేస్తే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. నార్త్ లో ఇది చాలా ఫేమస్. మరీ ఈరోజు మనం కూడా ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దామా..!

అమర్ కంద్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

పండిన మామిడి పండు ఒకటి
గట్టిపెరుగు ఒక కప్పు
తేనె అరకప్పు
బాదంపప్పు ముక్కలు ఒక టీ స్పూన్
జీడిపప్పు ముక్కలు ఒక టీ స్పూన్
యాలుకపొడి ఒక కొద్దిగా

తయారు చేసే విధానం..

బాగా పండిన బంగినపల్లి మామిడిపండు తీసుకుని తొక్కతీసి లోపల కట్ చేసుకోండి. అందులో సగం మాత్రమే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లా చేయండి. ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పిండేసిన గట్టిపెరుగు తీసుకుని అందులో తేనె వేసి కలపండి. ఐస్ క్రీమ్ లా అవుతుంది. అప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ వేసి కలుపుకుని యాలుకపొడి కూడా వేసి కలుపుకుని.. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ మిశ్రమం ఒక లేయర్ లా వేసుకుని పైన మ్యాంగో ముక్కలు వేసుకుని పైన మళ్లీ మ్యాంగో క్రీమ్ మళ్లీ మ్యాంగో ముక్కలు అలా వేసుకుని ఫైనల్ గా బాదంజీడిపప్పు ముక్కలు వేసుకుని కావాలంటే కాసేపు.. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లబడ్డాక తింటే సరి.. మ్యాంగో ఫ్లైవర్ తో ఐస్ క్రీమ్ తిన్నట్లే అనిపిస్తుంది. చిన్నపిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. పెరుగు ఆరోగ్యానికి మంచిది, ఎలాగో ఈ సీజన్లో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి ఇలా కూడా ఓసారి ట్రై చేసి చూడండి.!

Read more RELATED
Recommended to you

Latest news