నల్లజీలకర్రతో కీళ్లవాపు సమస్య మాయం..!

-

జీలకర్ర అంటే మనం వంటల్లో వాడేది మాత్రమే కాదు.. నల్ల జీలకర్ర కూడా ఒకటి ఉంటుంది. ఇది ఉంటుంది అని కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.. అనేక వ్యాధులను నయం చేసే శక్తి నల్ల జీలకర్రకు ఉంది. ముఖ్యంగా కీళ్లవాపులను చేత్తో తీసేసినట్లు నల్ల జీలకర్ర నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు..న‌ల్ల జీల‌క‌ర్ర‌లో థైమోక్వినోన్ అన‌బ‌డే ప్ర‌ధాన‌మైన బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. సైంటిస్టులు న‌ల్ల జీల‌క‌ర్ర‌పై ప‌రిశోధ‌న‌లు చేసి.. ఇందులోని ఔష‌ధ గుణాలు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయ‌ని కనుగొన్నారు..
40 మంది మ‌హిళ‌ల‌కు న‌ల్ల జీల‌క‌ర్ర నుంచి త‌యారు చేసిన నూనె క‌లిగిన క్యాప్సూల్స్‌ను నెల రోజుల పాటు నిత్యం ఇచ్చారు. ఈ క్రమంలో వాపున‌కు లోనైన వారి కీళ్ల‌లో కొంత వ‌ర‌కు స‌మ‌స్య త‌గ్గిన‌ట్లు వారు గుర్తించారు. అలాగే ఉద‌యాన్నే కీళ్ల‌కు ఏర్ప‌డే దృఢ‌త్వం అనే స‌మ‌స్య కూడా త‌గ్గిన‌ట్లు గుర్తించారు. దీంతో న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ప‌నిచేసే ఔష‌ధ‌మ‌ని పరిశోధకు నిర్థారణకు వచ్చారు.. దీన్ని ఉప‌యోగించి న్యూట్రిష‌న్ పిల్స్ త‌యారు చేసుకోవ‌చ్చ‌ని వారు ఔష‌ధ త‌యారీ కంపెనీల‌కు కూడా సూచించారు.
న‌ల్ల జీల‌క‌ర్రను నిత్యం పొడి రూపంలో లేదా నూనె రూపంలో తీసుకోవ‌చ్చు. దీన్ని భోజ‌నంలో క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా స‌ప్లిమెంట్ల రూపంలో వాడుకోవ‌చ్చు. ఎలా వాడినా ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య నుంచి మీరు ఉప‌శ‌మ‌నం పొందుతారు.. అయితే స‌ప్లిమెంట్లు వాడాలనుకుంటే.. వైద్యులను సంప్రదించిన తర్వాతే వాడాలి..

వీళ్లకు నల్లజీలకర్ర వద్దు..

న‌ల్ల జీల‌క‌ర్ర‌ను మోతాదుకు మించి వాడ‌కూడ‌ద‌ని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.. అలాగే గ‌ర్భిణీలు, పిల్ల‌ల‌కు దీన్ని ఇవ్వ‌కూడ‌ద‌ట.. భోజ‌నం చేశాకే న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకోవాలి. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకునే ముందు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి.
నల్ల జీలకర్రతో కీళ్లవాపుల సమస్య తగ్గుతుందంటున్నారు కాబట్టి.. మీకు సమస్య ఉంటే ఒకసారి ట్రై చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news