sదీనికి చాలా కారణాలున్నాయి. హెవీ ఫుడ్ తినడం, మలబద్దకం, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడం వీటికి కారణాలు. పాలు, పాల ఉత్పత్తులు కూడా గ్యాస్ ని కలగజేస్తాయి. ఈ సమస్యలను దూరం చేసుకునేందుకు కొన్ని పానీయాలను తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తేనె, నిమ్మరసం కలిపిన అల్లం టీ
మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలలో అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లం టీ ని తయారు చేసుకుంటే గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం అల్లం టీలో తేనెను కలుపుకోండి. కొద్దిపాటి నిమ్మరసం మిక్స్ చేయండి. తేనె వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మరసం కారణంగా చర్మం సురక్షితంగా ఉంటుంది.
చామంతి టీ
చామంతి టీ వల్ల ఒత్తిడి దూరమవుతుంది. కడుపులో మంటను తగ్గించడంలో ఇది చాలా తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వాయువును బయటకి తొలగిస్తుంది. అంతే కాదు తిమ్మిర్లు, కీళ్ళనొప్పులని దూరం చేస్తుంది.
సోంపు గింజలు
సోంపు గింజలతో చేసిన టీ జీర్ణశక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అందుకే అన్నం తిన్న తర్వాత సోంపు తినడానికి ఇష్టపడతారు. సోంపు గింజలని నీటిలో ఉడ్కబెట్టి తిన్నప్పుడు గ్యాస్ ని దూరం చేసే లక్షణాలని దక్కించుకుంటుంది.
వాము (ఓమ)
గ్యాస్, అజీర్ణాన్ని ఆమడ దూరంలో ఉంచే వాము చాలా చక్కటి ఇంటి ఔషధం. ఇవి రుచిని పెంచడానికి బాగా పనిచేస్తాయి. వాముతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. ఇందులో ఉండే థైమోల్ గ్యాస్ సమస్యలని దూరం చేస్తుంది.