సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ కు గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఎట్టకేలకు తాను ప్రేమించిన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఈ ఏడాది జూన్ 9వ తేదీన మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది.
ఇక వివాహం తర్వాత తిరుమల కొండకు చేరుకొని స్వామివారిని జంటగా దర్శించుకున్నారు. ఇకపోతే వివాహం ఎలా జరిగింది? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యాయి.
కానీ ఎలా జరిగింది అని తెలుసుకోవాలని అభిమానుల సైతం ఆతృతగా ఎదురు చూశారు. ఇక నయనతార విగ్నేష్ తమ పెళ్ళికి సంబంధించిన వీడియో డిజిటల్ రైట్స్ ను అత్యంత భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుంది.
ఇక తాజాగా నయనతార ఫోటోలు వైరల్ అయ్యాయి. తన భర్త విఘ్నేష్ తో స్పెయిన్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.