ప్రకృతి ఒడిలో టిల్లు బ్యూటీ.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నేహా శెట్టి

-

డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్​లో ఈ భామ వెకేషన్​లో జాలీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ కనిపించింది. ఎల్లో కలర్ ఔట్​ఫిట్​లో మెరిసిపోయింది. ఈ ఫొటోలను కాస్త నెట్టింట షేర్ చేసింది. ఈ భామ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో నేహా శెట్టి ఎల్లో కలర్ ఔట్ ఫిట్​లో కనిపించింది. సన్ లైట్​లో ఎల్లో ఔట్​ఫిట్​లో కళ్లకు గాగుల్స్ పెట్టుకుని సూపర్ ట్రెండీగా సందడి చేసింది. క్యూట్ క్యూట్ ఎక్స్​ప్రెషన్స్ ఇస్తూ తన అందంతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

నేహా శెట్టి మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ ఆకాశ్ పూరితో కలిసి నటించింది. ఆ తర్వాత డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ భామకు టాలీవుడ్​లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news