ఈ చిట్కాలతో మధుమేహం ఉన్నా 100 ఏళ్ళు బ్రతకొచ్చు..

-

డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా శరీర అవయవాలు సరిగా పనిచేయవు. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలా కాలం పాటు అలానే కొనసాగుతుంది. దాని ప్రభావాలను తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే 100 ఏళ్ళు దాకా మధుమేహం ఉన్నా హ్యాపీగా ఆరోగ్యంగా బ్రతకవచ్చు.

మధుమేహం చికిత్సలో మందులనేవి చాలా ముఖ్యమైనవి.వీటిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ ఇంకా ఇతర మందులు ఉన్నాయి.అవి జాగ్రత్తగా డాక్టర్స్ చెప్పినట్లు మరిచిపోకుండా వాడాలి.ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ఇది డయాబెటిస్‌లో ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ చక్కెర , కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ఫైబర్ ఇంకా ఆరోగ్యకరమైన నూనెలు ఖచ్చితంగా వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మధుమేహం ఈజీగా అదుపులో ఉంటుంది.ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఇంకా మధుమేహం నివారణ ఆరోగ్యకరమైన బరువు చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి. అందుకే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మద్యం , పొగ అస్సలు త్రాగవద్దు. మద్యపానం , ధూమపానం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.వీటిని ఆపడం చాలా అవసరం. సరిగ్గా నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోవడం అంటే 8 గంటలు పడుకోవడం కాదు. మధ్య రాత్రి దాకా పడుకోకుండా టైంకి పడుకొని టైంకి లేవాలి. రెగ్యులర్ చెకప్‌ చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను నియంత్రించడంలో రెగ్యులర్ చెకప్‌లు ఇంకా డాక్టర్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు ముఖ్యమైనవి. వీటిని తూచ తప్పకుండా అనుసరించడం ద్వారా, మధుమేహాన్ని ఈజీగా నియంత్రించవచ్చు. ఇంకా దాని ప్రభావాలను నివారించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news