చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో ఎంత గానో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ ఆహార పదార్థాలని మహిళలు పీరియడ్స్ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చాలా రకాల సమస్యలని దూరం చేసుకోవడానికి అవుతుంది. అయితే మరి మహిళలు ఎటువంటి ఆహార పదార్థాలని పీరియడ్స్ సమయంలో తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు చూద్దాం.
అరటి పండ్లు
అరటి పండ్లను మహిళలు పీరియడ్స్ సమయంలో తీసుకుంటే మంచిది చాలా మంది అతిసార సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు అరటి పండ్లను తీసుకుంటే మంచిది పైగా అరటిపండ్లలో పోషక పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
నీళ్లు ఎక్కువ తీసుకోండి
పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువ తీసుకోవడం వలన తలనొప్పి టెన్షన్ వంటివి దూరం అవుతాయి.
నారింజ
నారింజ లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పీరియడ్స్ సమయం లో నారింజ ని తీసుకోవడం వలన నొప్పి నుండి రిలీఫ్ వస్తుంది. నారింజ మాత్రమే కాకుండా మీరు సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు నిమ్మ దానిమ్మ వంటివి కూడా తీసుకోవచ్చు. ఇవి మానసిక స్థితిని సెట్ చేస్తాయి.
చేపలు
ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలానే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కడుపులో నొప్పిని తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.
గుడ్లు
పీరియడ్స్ సమయంలో గుడ్లని తీసుకుంటే బలహీనత తగ్గుతుంది.
డార్క్ చాక్లెట్
పీరియడ్స్ ఏమన్నా డార్క్ చాక్లెట్ ని తీసుకుంటే మూడ్ బాగుంటుంది అలానే అల్లం కూడా పీరియడ్స్ సమయంలో బాగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలకు కడుపునొప్పి వికారం తిమ్మిరి మల బద్దం మానసిక ఇబ్బందులు వంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి వీటిని తీసుకుంటే ఈ సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది.