వర్షాకాలంలో చాయ్ కి బదులు అలవాటు చేసుకోవాల్సిన ఆరోగ్యకర పానీయాలు..

-

భారతదేశ ఇళ్ళలో చాయ్(Chai) కి ప్రత్యేక స్థానం ఉంది. పొద్దున్న లేవగానే చాయ్ నీళ్ళు నోట్లో పడందే ఇళ్ళ నుండి బయటకి రానివాళ్ళు చాలామంది. ఇక వర్షాకాలంలో చాయ్ తాగడానికి వేళాపాళా అస్సలు చూసుకోరు. చిన్నగా వాన ముసురు పడిందంటే చాలు వేడి వేడి చాయ్ పెదాలకు తగలాలని ఆరాటపడుతుంటారు. ఐతే వర్షాకాలంలో చాయ్ కి బదులు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని మీకు అనిపిస్తుందా? మహమ్మారి సమయంలో ఆరోగ్యకరమైన పానీయం ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? ఇది మీకోసమే.

గ్రీన్ టీ

తక్కువ కెఫైన్ ఉండే ఈ టీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వాడే ఆకులు ఆక్సీకరణం చెందకుండా ఉంటాయి. దాల్చిన చెక్క, నిమ్మ, తులసి, పుదీనా వంటి విభిన్న రూపాల్లో లభించే గ్రీన్ టీలో ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు ఉన్నాయి.

ఐస్ గ్రీన్ టీ

సాధారణంగా ఈ గ్రీన్ టీని వేసవిలో తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు. దీన్ని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముందుగా ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని, వేడి చేసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకుని, ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగులను అందులో ముంచాలి. ఐదు నిమిషాలయ్యాక వేరే పాత్రలో పోసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలు. కావాలంటే నిమ్మ, తేనె, చక్కెర కలుపుకోవచ్చు.

బ్లాక్ టీ

వేరు వేరు దేశాల్లో వేరు వేరుగా పిలుచుకునే బ్లాక్ టీ, డయాబెటిస్ ని తగ్గించడంలో, అధిక కొవ్వును కరిగించడంలో, కిడ్నీ రాళ్లను కరిగించడంలో సాయపడుతుందని చెప్పుకుంటారు.

హెర్బల్ టీ

ఎండిపోయిన పూలు, చామంతి, మందారం, అల్లం, నిమ్మగడ్డి, పెప్పర్మెంట్ వాటితో తయారయ్యే ఈ టీలో కెఫైన్ ఉండదు. అందువల్ల చాయ్ తాగవద్దని నియమ నిబంధనలు ఉన్నవారు కూడా దీన్ని తాగవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news