గర్భనిరోధకమాత్రలు విరివిగా వాడుతున్నారా..ఈ ‌విషయాలు తెలుసుకోండి ఓసారి..!

-

అనుకోని పరిస్థితుల్లో స్టెప్ తీసేసుకోవటమో లేదా పెళ్లైనా అప్పుడే పిల్లలు వద్దు అనుకోవటమే వంటి సందర్భాల్లో కొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలకు అలవాటుపడుతున్నారు. అయితే వీటిని వాడటం వల్లే జరిగే మంచికంటే చెడే ఎక్కువగా ఉందట. ఈ విషయాలు ఓసారి తెలుసుకోండి. ఇంకెప్పైనా వీటి అవసరం ఉంటే..ప్రత్యామ్మాయం ఆలోచించవచ్చు కదా..

 birth control pills

గర్భనిరోధక మాత్రల్లో ఒక టైప్ సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరుగకుండా ఆపుతుంది. గర్భనిరోధక మాత్రలు మహిళలకు పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కాకుండా తగ్గిస్తాయి. వీటిని వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అంతేగాక హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు.

1960లో గర్భనిరోధక మాత్రలు ప్రవేశపెట్టారు..అప్పుడు మహిళలు చాలా సంతోషించారు. గర్భం దాల్చకపోవడం అనేది పూర్తిగా తమ నియంత్రణలో ఉందని తెగా ఆనందపడ్డారు.అయితే గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో ప్రతీ ఏటా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు గర్భస్రావాలకు గురవుతున్నారట. వీరిలో 75 శాతం మంది మహిళలు వైద్యుడిని సంప్రదించకుండానే మందులు తీసుకుంటున్నారని తేలింది.

గర్భనిరోధక మాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలు:

ఈ పిల్స్ వాడటం వల్ల వికారం లేదా వాంతులు, తలనొప్పి. డిప్రెషన్‌తో కూడా బాధపడుతున్నారని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా పీరియడ్స్ పెరిగిన వ్యవధి వంటి సమస్యలు కూడా కనిపించాయట. వైద్య నిపుణులు చెప్పిందాని ప్రకారం ముఖ్యంగా 25-45 ఏళ్ల వయసు లోపు మహిళలు ఈ మాత్రలు వాడకూడదు. కౌమారదశలో ఉన్నవారు పదే పదే ఉపయోగిస్తే.. అవి వారి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల స్థాయిలు లేని యువతులు ఈ మాత్రలు తీసుకోవడం కూడా ప్రమాదకరమట. కొంతమంది మహిళల్లో బరువు పెరగడానికి కూడా ఈ మాత్రలు కారణమవుతున్నాయని తేలింది.

వీళ్లు అసలు వాడకూడదు:

ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. 10 ఏళ్లకు పైగా వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని పలు పరిశోధనలు హెచ్చరించాయి.గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. గతంలో ఏ సందర్భాల్లో అయినా రక్తం గడ్డం కట్టినా వారు కూడా వీటికి దూరంగానే ఉండాలి.అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని తీసుకోకూడదు.

ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనమాట ఈ పిల్స్ తీసుకోవటం వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడో భవిష్యత్తులో వస్తాయి..కానీ ఇప్పుడు అలాంటి పిల్స్ వేసుకోకపోతే..పెళ్లికి ముందే హద్దుదాటిన అమ్మాయిల పరిస్థితి ఏంటి. ఈ కారణంతోనే ఎక్కువగా వాడుతున్నారట. ఈ సమస్య రాకూడదంటే..సెఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవటం ఒకటే మార్గం.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news