ఈ టైంలో గ్రీన్ టీ తాగుతున్నారా అయితే డెంజరే మరీ..!

-

బరువు తగ్గాలంటే మనందరికి ముందుగా గుర్తుకువచ్చేది గ్రీన్ టీ..గ్రీన్ టీ అంటేనే బరువు తగ్గటానికి తీసుకుంటారు అని నమ్ముతుంటాం. అలా అనే కొంతమంది రోజుకు ఐదారు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీ మంచిదే..కానీ అది తాగే టైం కూడా చాలా ముఖ్యంమట. ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు తాగకూడదట. కాబట్టి మనం ఈరోజు గ్రీన్ టీని ఏ టైంలో ఎంత మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసుకుందాం.గ్రీన్ టీ చాలా రకాలు ఉంటాయి. అందులో కాల్చని ఆకులతో చేసే గ్రీన్ టీ తీసుకుంటే అనేక పోషకాలుంటాయ్ అని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు, ఎన్ని గ్లాస్ లు టీ తాగాలి?

సాధారణంగా కాఫీలో కెఫిన్ ఉంటుందని మనందరికి తెలుసు. కానీ గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. దీంతో పాటు యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీ అయినా సరే రోజుకు రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు. అలాకాకుండా బరువు త్వరగా తగ్గాలని ఎక్కువ సార్లు గ్రీన్ టీ తాగితే నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయట. దాంతోపాటు శరీరంలో పోషక విలువలున్న అన్ని ద్రవాలు బయటకుపోతాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం..భోజన సమయాల్లో గ్రీన్ టీ తాగటం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
భోజనానికి రెండు గంటలకు ముందుగా లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తాగటం మంచిది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ అసలే తాగకూడదట. భోజనం చేస్తున్న సమయంలోనే గ్రీన్ టీ తాగితే.. పోషకాలు సేకరణ తగ్గుతుంది. అలాగే శరీరంలో ఐరన్, మినరల్స్ గ్రహించలేదు. రోజుకు 1-2 కప్పులు తాగితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ టీ ఆకలిని తగ్గిస్తుందని తద్వారా కేలరీల నియంత్రణతో బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, అజీర్తి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ చాలా తక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
greentea

గ్రీన్ టీ ఎలా చేస్తారు

గ్రీన్ టీ ని ఆకులు లేదా. టీ బ్యాగ్ లతో తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేయాలి. లేదా ఒక కప్పు హాట్ వాటర్ కి.. ఒక టీ బ్యాగ్ వాడితే సరిపోతుంది. టీ ఆకులనైతే… 2-3 నిమిషాలు వేడి నీటిలో ఉంచాలి. ఎక్కువసేపు వేడి చేస్తే టీ రుచి చేదుగా మారుతుంది . ఇప్పుడు తయారుచేసిన టీని ఒక కప్పులో వడకట్టండి. రుచి కోసం కొన్ని చుక్కల తేనె, నిమ్మ లేదా అల్లం ముక్క వేసుకోండి.  అంతే ఆరోగ్యకరమైన గ్రీన్ టీ రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news