ఆరోగ్యానికి మంచిదని రాగిపాత్రలో నీళ్లు తాగేస్తున్నారా..? కాస్త ఇవి చూడండి..!

-

రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలుసు.. పురాతన కాలం నుంచే చెప్తున్న మాట ఇది. అనేక వ్యాధులను దూరం చేయగల శక్తి రాగినీళ్లకు ఉందని పెద్దోళ్లు అంటుంటారు. కానీ మంచి ఎప్పుడూ పూర్తిగా మంచి మాత్రమే చేయదు. మితిమీరితో అదే ప్రాణంతకం అవుతుంది. అర్థంకాలేదా..! రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయట. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యానికి మంచివి అనుకుని తాగే నీళ్లే మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఇంతకీ ఆ తప్పులేంటంటే..!

భోజనం చేసిన తర్వాత రాగి పాత్రలో ఉంచిన నీటిని ఎప్పుడూ సేవించకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ మందగించడం, కడుపు నొప్పి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
రాత్రి నిద్రపోయే సమయంలోనూ రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగకూడదట…ఉదయం ఖాళీ కడుపుతో కాపర్‌ వాటర్‌ తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది.

రాగి పాత్రలో ఉంచిన నీటి ప్రయోజనాన్ని పొందడానికి నీటిని రాగి పాత్రలో 12 నుండి 48 గంటల పాటు నిల్వ చేసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. మీరు రోజంతా రాగి పాత్రలో నీరు తాగాలనుకుంటే, దాని వల్ల ఎటువంటి హాని ఉండదు. కానీ.. నీటిని తాజాగా నింపాలి.

రాగి పాత్రలో ఉంచిన నీటిని పరిమిత పరిమాణంలో తాగాలి. 2 లీటర్ల కంటే ఎక్కువ తాగితే కడుపు నొప్పి, గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు.

శరీరంలో అధిక మొత్తంలో రాగి స్థాయులు ఉంటే వికారం, వాంతులు, కడుపు నొప్పి లేదా అతిసారం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కొన్నిసార్లు.. కాలేయ వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులకు కూడా వస్తాయట.

రాగి పాత్రలో నీటిని ఉంచినప్పుడల్లా నేలపై ఉంచకూడదు. చెక్క స్టూల్ లేదా ఇతర వస్తువులపై కాపర్‌ బాటిల్స్‌ ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రాగి స్వచ్ఛత ఉంటుంది నిపుణులు అంటున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version