బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా..? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

-

ఎక్కువ ఆహారాన్ని తినేస్తున్నామని అనిపిస్తున్నా లేదంటే డైటింగ్ వంటివి చేయడం వలన కానీ చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే టైం లేక బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాలి. మీరు కూడా మీ బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా..? అయితే కచ్చితంగా దీని గురించి చూడాల్సిందే. బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తలనొప్పి మైగ్రేన్:

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల తలనొప్పి సమస్య కలగవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలానే మైగ్రేన్ సమస్య కూడా రావచ్చు అని చెబుతున్నారు. కాబట్టి స్కిప్ చేయకండి.

ఆందోళన:

బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల ఆందోళన కూడా వస్తుంది కాబట్టి ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.

క్యాల్షియం లోపం, హిమోగ్లోబిన్ లోపం:

భోజనం మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం, హిమోగ్లోబిన్ లోపం రావచ్చు కాబట్టి ఈ తప్పుని అసలు మీరు చేయకండి.

యాసిడ్ రిఫ్లెక్స్:

బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోకపోవడం వలన యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య కూడా కలుగుతుంది.

బరువు తగ్గిపోవడం:

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల బరువు కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని కచ్చితంగా తినండి. లేదంటే ఇవి తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news