అమెరికాలో చదువుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..

-

అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది గుడ్‌న్యూస్‌. అమెరికాలో జనవరి నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి గాను వీసా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించేందుకు అక్కడి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో 82 వేల మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ చేసింది అమెరికా సర్కార్‌. అయితే.. ఈసారి అంతకుమించి వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్టు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వీసా జారీ ప్రక్రియలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రేపటి నుంచే వీసా స్లాట్లను విడుదల చేయనుంది.

us visa: Lack of short-term US visa availability impacting tech companies -  The Economic Times

ప్రస్తుతం పర్యాటక, విద్యార్థి, ఇతర వీసాల కోసం 400 రోజులకుపైగా ఎదురుచూడాల్సి వస్తోంది. మరోవైపు, అక్టోబరులో కొన్ని, నవంబరు రెండోవారంలో మరికొన్ని విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్ కాన్సులర్ హెఫ్లిన్ ఇప్పటికే ప్రకటించారు. స్లాట్లు ఏ క్షణాన్నయినా విడుదల అవుతాయని, కాబట్టి విద్యార్థులు తరచూ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news