చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా…? ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కుదరడం లేదా..? అయితే కచ్చితంగా ఈ చిట్కాలను చూడాలి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అధిక కొలెస్ట్రాల్ వలన గుండె సమస్యలు, స్ట్రోక్, డయాబెటిస్, హైపర్టెన్షన్ మొదలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంతవరకు జాగ్రత్త పడాలి లేకపోతే వివిధ రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు ఇలా మార్పులు చేసుకోండి.
మీరు మీ డైట్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, కరిగే ఫైబర్ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. ఇది మీకు ప్లస్ అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
డైట్ లో వాల్ నట్స్, అవిస గింజలు, సల్మాన్, టూనా వంటివి తీసుకుంటూ ఉండండి ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి.
అలానే మీరు మీ బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోండి. బాగా బరువు పెరిగిపోకుండా చూసుకోండి బాగా బరువుగా ఉండడం వలన హైపర్ టెన్షన్ డయాబెటిస్ సమస్య కలగవచ్చు.
స్మోకింగ్ కి దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. స్మోకింగ్ వలన వివిధ సమస్యలు కలుగుతూ ఉంటాయి. సో ఈ తప్పు కూడా అసలు చేయకండి.
రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉండండి. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది వ్యాయామం చేయడం వలన గుండె జబ్బులు పక్షవాతం రావు. గుండెకు సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే మరీ మంచిది.
మద్యపానానికి కూడా దూరంగా ఉండండి. ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా అధిక కొలెస్ట్రాల్ హైపర్ టెన్షన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.