పొట్ట తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇలా చెయ్యండి తగ్గుతుంది..!

-

చాలా మంది పెద్ద పొట్టతో బాధపడుతూ ఉంటారు. ఆ పొట్టని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా దానిని తగ్గించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేసినా కుదరడం లేదా అయితే కచ్చితంగా మీరు ఇలా ట్రై చేయాల్సిందే..

ఇలా కనుక మీరు అనుసరిస్తే ఈజీగా మీ పొట్టని తగ్గించుకోవచ్చు. ఎక్కువమంది ఈ మధ్యకాలంలో గుండె ఫోటో షుగర్, బీపీ రక్తనాళాలు అడ్డంకులు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా ఉండాలని ఆహారంలో మార్పులు చేస్తున్నారు ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారు అధిక బరువుని కూడా తగ్గించుకోవడానికి రకరకాల చిట్కాలను ట్రై చేస్తున్నారు. నిజానికి వంటల్లో ఉపయోగించే మెంతులు బాగా పనిచేస్తాయి.

మెంతులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటిని వాడితే సులభంగా బరువు తగ్గొచ్చు మెంతులతో ఈ విధంగా మీరు కషాయం తయారు చేసుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఒక గిన్నెలో మెంతులు, గ్లాసు నీళ్లు పోసి మరిగించండి ఈ నీళ్లు అర గ్లాసు అయ్యేదాకా ఉంచండి తర్వాత వడకట్టేసుకుని గోరువెచ్చగా దీనిని తీసుకోండి రోజుకి మూడుసార్లు మీరు ఈ మెంతులు కషాయాన్ని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ఉదయం పూట తగిన కాసేపు వరకు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. అలానే మధ్యాహ్నం, రాత్రి భోజనం అయ్యాక గంట తర్వాత తీసుకుంటే పేరుకుపోయిన కొవ్వుని తొలగించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news