ఉదయం నిద్రలేవగానే కాళ్లు, చేతులు ఉబ్బిపోతున్నాయా..? అమ్మో ఇదే సమస్య కావొచ్చు..

-

ఉదయం నిద్రలేవగానే నెట్‌ ఆన్‌ చేసుకుని ఫోన్‌ చూసుకోవడం కాదు.. మనల్ని మనం చూసుకోవాలి. ఫేస్‌ ఎలా ఉంది. కళ్లు ఎలా ఉంటున్నాయి, చేతులు, కాళ్లలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని. ఎందుకంటే మనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది నిద్రలేచిన తర్వాత కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయంటే.. షుగర్‌ ఎక్కువైందనో, డయబెటిస్‌ భారిన పడుతున్నామనో సంకేతం.. రోజూ అలానే ఉంటే.. కచ్చితంగా టెస్ట్‌ చేయించుకోవాల్సిందే.! అలాగే కొంతమందికి చేతులు, కాళ్లు వాచిపోయి ఉంటాయి. ఇది కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యకు కారణం. ఇది ఎలాంటి వ్యాధులకు దారి తీస్తాయో తెలుసుకుందాం..!

కిడ్నీ సమస్యకు కూడా చేతి వాపు సంకేతంగా భావించవచ్చు. కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది నిర్విషీకరణకు పని చేస్తుంది. దీని కారణంగా కిడ్నీలో ఇతర రకాల సమస్యలు కూడా వస్తాయి. అందుకే సమయానికి వైద్యుల సలహా తీసుకోవాలి. తద్వారా వ్యాధి నుండి బయటపడవచ్చు.

చాలా కాలంగా కీళ్లనొప్పులు వంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే చేతి వాపు అసలు కారణం కావచ్చు. దానికి సకాలంలో చికిత్స తీసుకోవడం వలన ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది.. కావున సరైన సమయానికి వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి.

గర్భిణులు ఉదయం మేల్కొన్నప్పుడు.. చేతులు, కాళ్ళలో వాపు కనిపిస్తుంది. కాళ్లు, చేతులు, కీళ్లలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్య కనిపించవచ్చు. అయితే, భయపడాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. స్త్రీలు బరువు పెరిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. బిడ్డ పుట్టిన తరువాత ఈ సమస్య ఉండదు. అయితే, చేతిలో వాపు వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం..

చాలా మంది సరైన పోషకాహారం తీసుకోకపోగా.. రుచి కోసం తమ ఆహారంలో ఎక్కువ ఉప్పును వాడతారు.. అధిక ఉప్పు కారణంగా చేతులు, కాళ్లలో తీవ్రమైన వాపు, నొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. లేదందే ఇది ఇంకా అనేక సమస్యలకు దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news