దేశాన్ని, ప్రజలను గాలికి వదిలేస్తున్నరు : సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. వేదిక అధ్యక్షురాలిగా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరించారు. ఈ సభకు భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గిరిజనులు, బంజారాలు హాజరయ్యారు. గిరిజనులకు గిరిజన భాషలోనే ప్రణామాలు చేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతమని ఆయన అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలున్నయని, దేశంలో విపరీతమైన దేవుడు ఇచ్చిన ప్రకృతి సంపద ఉన్నదని, నదుల్లో నీరు ఉన్నది. పుష్కలంగా కరెంటు ఉన్నది. ఏడేళ్ల కిందట మన బతుకు ఎట్ల ఉండే. ఇవాళ కష్టపడ్డమన్నారు సీఎం కేసీఆర్‌.

Telangana CM KCR to inaugurate T-Hub's new facility on June 28 - India News

మన చేతుల్లో ఉంది కాబట్టి చేసుకున్నమన్న సీఎం కేసీఆర్‌.. దాన్ని బతకనివ్వకుండా ప్రతి బోరుకు పెట్టాలే.. ముక్కు పిండి ప్రజల వద్ద పైసలు వసూలు చేయాలంటున్నారు ఈ మోదీ అంటూ ఆయన మండిపడ్డారు. ఇలానే అనేక విషయాల్లో సులభంగా పరిష్కరించే విషయాల్లో తాత్సారం చేస్తూ దేశాన్ని, ప్రజలను గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. తమకు ఇష్టమైన వ్యక్తులు, కోటీశ్వరులకు, షావుకార్లకు దేశ సంపదను దోచిపెడుతూ ప్రైవేటైజేషన్‌ పేరిట లక్షల కోట్ల ప్రజల ఆస్తులను ప్రైవేట్‌ పరం చేస్తున్నదని, దుర్మార్గం పోవాలె అన్నారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news