మొటిమల సమస్య బాధిస్తుందా..అయితే ఈ ఆహరపదార్థాలను కాస్త పక్కనపెట్టండి..!

-

యంగ్ ఏజే లో మొటిమలు పెద్ద సమస్య. ముఖం మీద వచ్చి మొత్తం ఫేస్ ని అంతా కరాబ్ చేస్తుంటాయి. కొంతమందికి అయితే ఎన్ని క్రీమ్స్ వాడినా తగ్గనే తగ్గవు. ఇక యూట్యూబ్ లో వీడియోలన్నీ చూసి ఏవేవో ట్రై చేస్తుంటాం. ఫ్రెండ్స్ చెప్పిన చిట్కాలు కూడా పాటించే ఉంటారుగా..అయితే ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ పైన చేసేదానికంటే..లోపల వేసే ఫుడ్ మీదే ఎక్కువ శ్రద్ద చూపించాలి. తినే ఫుడ్ వల్లనే మొటిమలు వస్తాయని పరిశోధనల్లో తేలింది.

ఆర్చీవ్స్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు మొటిమలకి కారణమవుతాయని రుజువు చేయబడింది. శుద్ధి చేసిన పిండి పదార్థాలు తినడం వలన ఇన్సులిన్ స్థాయి పెరిగి సిబం ఉత్పత్తి పెరుగుతుంది. మరియు స్వేధ రంధ్రాలకి అడ్డుపడుతుంది. మొటిమలును కలిగించే ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాక్లెట్

చాక్లెట్స్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది. చాక్లెట్ లో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది. అందువలన సిబం యొక్క ఉత్పత్తి పెరిగి, శరీరంలో తాపజనక ప్రతిస్పందనకి కారణమవుతుంది. డార్క్ చాక్లెట్ కంటే, పాలు మరియు వైట్ చాక్లెట్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. మొటిమలు రాకుండా ఉండాలంటే చాక్లెట్ తినడం తగ్గించుకోవటం ఉత్తమం.

స్పైసీ ఫుడ్

దుకాణాలలో దొరికే సాస్ తో చేసిన స్పైసీ ఫుడ్ వలన చర్మం పై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మిరియాలతో తాజాగా ఇంట్లోనే తయారు చేసే మిర్చి సాస్ అంతగా ప్రభావం చూపించదు. ఘాటుగా ఉన్న ఆహారం వలన మొటిమలు వస్తాయని రుజువు అవకపోయినా..ఏ ఆహార నిపుణుడిని అడిగిన ఘాటైన ఆహరం మొటిమలకి కారణమని చెప్తారు. అందుకే పచ్చళ్లు వంటివి కూడా ఎక్కువతింటే మొటిమలు వస్తుంటాయ్ అంటారు.

జున్ను

2005 సం.లో జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అకాడెమి ఆఫ్ డెర్మటాలజీ వ్యాసం ప్రకారం 47,355 మంది మహిళలపై చేసిన పరిశోధన ప్రకారం పాలు మరియు పాల ఉత్పత్తుల జున్ను, వెన్న, తక్షణ అల్పాహార పానీయాలు, కాటేజ్ జున్ను వలన మొటిమలు లేక చర్మం పై పగుళ్ళు సంభవిస్తాయని తేలింది. కాబట్టి జున్నుతో చేసిన బేకరీ ఉత్పత్తులని తినటం తగ్గించండి.

సుశి

నమ్మలేకపోతున్నారా.. సుశి రోల్స్, లేక సుశితో చేసిన సలాడ్స్, స్పైరులిన్ కలపబడిన ఆహార పదార్థాలలో ఎక్కువగా అయోడైడ్ లు ఉంటాయి. ఈ అయోడైడ్ ల వలన ఒక వారం రోజుల్లోనే విపరీతమైన మొటిమలు వస్తాయట.

పాలు

ఇందాక చెప్పినట్లు జున్నుతో మొటిమలు కలుగుతాయి, కాని జున్ను అనేది ఒక పాల ఉత్పత్తికి సంబందించినది. 4,273 మంది యుక్త వయసులో ఉన్న అబ్బాయిలలో చేసిన పరిశోధనలో పాల వలన కూడా మొటిమలు కలుగుతాయని తేలింది. ఎందుకంటే, మనం తాగే పాలు గర్భం దాల్చిన ఆవుల నుంచి వచ్చినవి. వాటిలో ఎక్కువగా హార్మోన్లు ఉండడం వలన స్వేధ గ్రంధాలని అలసిపోయేలా చేస్తాయి. కావున పాలు, మొటిమలు పుట్టించడంలో ఒక ముఖ్య కారణం అవుతుంది.

సోడా

సోడాలో ఎక్కువగా శుద్ధి చేయబడిన చక్కెర ఉంటుంది. ఇలాంటి పదార్థాలు తినడం లేక త్రాగడం వలన రక్తంలో చక్కెర మరియు క్రొవ్వు శాతం పెరుగుతుంది. దీనికి శరీరం తట్టుకోలేక రక్తంలోని చక్కెర నుంచి ఇన్సులిన్ , టెస్టోస్టెరాన్ విడుదల అవుతాయి. దాని వలన చర్మం పై మంటగా ఉండి, స్వేధ గ్రంధాలు ముసివేయబడతాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్

చాలామందికి ఇష్టమైన ఐటమ్ కదా.. మీకు వీటి గురించి తెలిసిన తినకుండా ఉండలేరు. వాస్తవం ఏమిటంటే, ఆలుగడ్డ ముక్కలను డీప్ ఫ్రై చేసే వీటి వలన చర్మంపగుళ్ళకి కారణమవుతుంది. ఈ చెడు ప్రభావం కలగడానికి సరైన కారణం తెలుసుకోవడానికి చాల పరిశోధనలు చేస్తున్నారు.

అయితే ఈ ఆహార పదార్థాలే అందరిలో సమానంగా మొటిమలకి కారణమవుతాయని కచ్చితంగా చెప్పలేదు. కొందిరకి చాక్లెట్స్ తింటే రావొచ్చు మరికొందరికి జున్ను తింటే రావొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంటారు. వీటిల్లో మీరు ఏదైనా ఎక్కువగా తింటుంటే మీకు మొటిమలసమస్య ఉన్నట్లైతే వాటిని తగ్గించుకునే ప్రయత్నంచేయండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news