ఆడవాళ్ళ సహజ అందానికి మరింత వన్నే తెచ్చే సాధనాలలో లిప్ స్టిక్ కూడా ఒకటి. పెదాల రంగుని మరింత విప్పారితం చేస్తూ ముఖంలో మరింత వర్ఛస్సుని తెస్తుంది. అందుకే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లో లిప్ స్టిక్ తప్పకుండా ఉంటుంది. ఐతే అందరికీ అన్ని రకాల లిప్ స్టిక్స్ సెట్ అవ్వవు. ముఖఛాయని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకం లిప్ స్టిక్ బాగుంటుంది. దానికోసం బ్యూటీషియన్స్ ఉన్నా కూడా స్వతాహాగా తమకేదీ నప్పుతుందో ఆడవాళ్లకి తెలిసి ఉండాలి.
ఐతే ఒక్కోసారి లిప్ స్టిక్ విరిగిపోతుంటుంది. సాధారణంగా విరిగిన లిప్ స్టిక్ తో మేకప్ వేసుకోవడం కుదరదు. అటువంటప్పుడు చేసేదేమీ లేక కొత్త లిప్ స్టిక్ కొంటుంటారు. విరిగిన ప్రతీసారీ లిప్ స్టిక్ కొనాలంటే కష్టమే. ఎందుకంటే మార్కెట్లో వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా లిప్ స్టిక్ ఎక్కువ రోజులు వాడకపోతే విరిగిపోతుంది. అలాంటప్పుడు ఇంట్లోనే మనం దాని మళ్లీ తయారు చేసుకోవచ్చు.
ముందుగా విరిగిన లిప్ స్టిక్ ముక్కలని తీసుకోవాలి. దాంతో పాటు షియా బటర్ ( షియా చెట్ల నుండి వస్తుంది. మార్కెట్లో విరివిగా దొరుకుతుంది). మైక్రోవేవ్, లిప్ స్టిక్ కంటైనర్ తీసి ఉంచుకోవాలి.
లిప్ స్టిక్ ని పూర్తిగా గిన్నెలోకి తీసుకుని, దానికి టేబుల్ స్పూన్ షియా బటర్ కలుపుకుని పది నుండి పన్నెండు సెకన్లపాటు మైక్రోవేవ్ చేయాలి.
పది సెకన్ల తర్వాత ఆ గిన్నెలో ఎలాంటి గట్టి పదార్థాలు లేకుండా చూసుకోవాలి. అంటే ద్రవం పూర్తిగా చిక్కబడేటట్టు మైక్రోవేవ్ చేయాలి.
ఆ తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఆ ద్రవాన్ని అలాగే ఉంచుకోవాలి. అప్పుడు ఆ చిక్కటి ద్రవాన్ని లిప్ స్టిక్ కంటైనర్ లో పోసుకోవాలి. వెంటనే దాని ఉపయోగించకుండా కొన్ని గంటలపాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి చూస్తే మీ లిప్ స్టిక్ రెడీ అవుతుంది.