వైరల్ వీడియో.. PPE కిట్ లో మోహన్ బాబు..!

-

టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు.. 500లకు పైగా చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా.. ప్ర‌తి నాయ‌కుడిగా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోగా రాణించడమే కాకుండా నిర్మాత‌గా కూడా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఏ విషయాన్నైనా సుత్తి లేకుండా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ఈ డైలాగ్ కింగ్ కి సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటంటే.. మోహన్ బాబు పీపీఈ కిట్ ధరించి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. కరోనా నేపథ్యంలో ఫేస్ మాస్కుతో పాటు, గ్లవ్స్ ను ఆయన ధరించారు.

విమానాశ్రయంలోకి ఆయన వెళ్తుండగా సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే మోహన్ బాబు ప్రస్తుతం డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలొ ‘సన్నాఫ్ ఇండియా’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news