ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. మంచి చర్మాన్ని పొందాలనుకుంటుంటారు. మంచి చర్మాన్ని పొందడం కోసం మాయిశ్చరైజర్లు రాయడం లోషన్లు క్రీములు సిరంస్ ఇలా అన్నిటినీ రాస్తూ ఉంటారు ఫేస్ ప్యాక్ లు ఫేషియల్స్ ని కూడా చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు చర్మం చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటారు అయితే చాలా మంది చేసే ఈ తప్పులు వలనే చర్మం పాడవుతుంది మరి ఎటువంటి తప్పులు చేయకూడదు..? చర్మాన్ని ఎలా బాగా ఉంచుకోవాలనే విషయాన్ని చూద్దాం.
చాలామంది ముఖాన్ని సరిగ్గా ఉంచుకోరు దుమ్ముదులి మురికి నూనె ఇటువంటివన్నీ కూడా చర్మం మీద పేరుకుపోతూ ఉంటాయి. ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే మొటిమలు మొదలు మచ్చలు బ్లాక్ హెడ్స్ ఇలా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దీంతో అందం పాడవుతుంది. ముఖం అందంగా ఉండదు. సో మొదట మీరు మీ స్కిన్ ని శుభ్రం చేసుకోవాలి చాలామంది చర్మాన్ని ఎక్కువగా ఎక్స్ప్యాలియెట్ చేస్తూ ఉంటారు. దీని వలన ఎక్కువ నూనె మురికి వంటివి పోతాయి. ఎక్కువ సార్లు చేస్తే చర్మం పొడిగా మారిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వారానికి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ ఈ పద్ధతి ని ఫాలో అవ్వకూడదు.
కఠినమైన ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వలన కూడా చర్మం పాడవుతుంది ఎప్పుడూ కూడా ఏదైనా ప్రోడక్ట్ ను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రొడక్ట్ ని ఉపయోగించుకోండి. చాలా మంది సన్ స్క్రీన్ లోషన్ ని ఉపయోగించేటప్పుడు కూడా తప్పుని చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ లోషన్ ని వాడేటప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ కూడా ఎండ ఉన్నా లేకపోయినా పగటిపూట సన్ స్క్రీన్ లోషన్ ని అప్లై చేసుకోండి ముఖానికి మాత్రమే కాదు మెడ చేతులకి కూడా అప్లై చేసుకోవచ్చు. మేకప్ తో నిద్రపోకూడదు. మేకప్ తో నిద్రపోతే కూడా చర్మ సమస్యలు వస్తాయి. చేతులు శుభ్రంగా లేనప్పుడు చర్మాన్ని తాకకండి అది కూడా చర్మాన్ని పాడు చేస్తుంది మొటిమల్ని గిల్లుతూ ఉంటారు చాలామంది అలా కూడా చేయద్దు.