ఇలా మాయిశ్చరైజర్ తయారు చేసుకుంటే డ్రై స్కిన్ సమస్యల నుండి బయట పడచ్చు..!

ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకు అయితే ఎప్పుడు చూసినా చర్మం పొడిబారిపోతుంది. దీని వల్ల క్రీమ్స్ వంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. అయితే నార్మల్ గా మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగించడం వల్ల దానిలో కెమికల్స్ స్కిన్ పై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

కనుక డ్రై స్కిన్ సమస్యతో బాధపడే వాళ్లు ఇంట్లోనే మాయిశ్చరైజర్ ని తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. దీనితో కెమికల్స్ బారిన పడే అవకాశం కూడా ఉండదు. అయితే మరి ఇక ఇంట్లోనే మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకోవాలి..?

ఈ విధంగా మాయిశ్చరైజర్ ని తయారు చేసుకుని ఉపయోగిస్తే డ్రై స్కిన్ వాళ్లకి ప్రయోజనకరంగా ఉంటుంది.

తేనె మరియు గ్లిజరిన్:

తేనె మరియు గ్లిజరిన్ చర్మానికి మంచి బెనిఫిట్స్ ని ఇస్తాయి. దీని కోసం మీరు రెండు టీ స్పూన్ల గ్లిజరిన్ ని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి దానిలో రెండు టీ స్పూన్స్ గ్రీన్ టీ మరియు 1 స్పూన్ నిమ్మరసం వేసి ముఖం మీద ఆ మిశ్రమంతో మసాజ్ చేయండి. రాత్రిపూట దీనిని అప్లై చేసుకుని వదిలేసి ఉదయం లేచిన తర్వాత మీ ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది.

అలోవెరా మాయిశ్చరైజర్:

అలోవేరా లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద మందులలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. చర్మానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే అలోవెరా మాయిశ్చరైజర్ ని తయారు చేసుకోవడానికి ముందుగా పావు కప్పు కొబ్బరి నూనె తీసుకుని దానిలో పావు కప్పు బాదం నూనెను కలపండి.

12 టీస్పూన్స్ బీవ్యాక్స్ వేసి కరిగించండి. ఇది చల్లబడిన తర్వాత దీనిలో ఒక కప్పు ఆలోవెరా గుజ్జుని వెయ్యండి. దానితో పాటుగా పది చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఈ మిశ్రమాన్ని మీరు ఫ్రిజ్ లో పెట్టేసి ఉపయోగించుకోవచ్చు. ఇలా డ్రై స్కిన్ వాళ్లు చక్కగా ఈ ప్రయోజనాలు పొంది సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు.