కరోనా సమయంలో సైక్లింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు..

-

కరోనా మహమ్మారి వచ్చి సంవత్సరం దాటిపోయింది. చైనా నుండి మొదలైన దీని విస్తరణ ప్రపంచ దేశాలన్నింటీకీ తాకింది. కరోనా దెబ్బకు కుదేలైపోయిన జీవితాలెన్నో. లాక్డౌన్, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం వంటివన్నీ పాటిస్తున్నప్పటికీ కరోనా బారిన పడుతున్నవారు పెరుగుతూనే ఉన్నారు. కరోనా వ్యాప్తిలో అమెరికా అగ్ర స్థానంలో ఉంది.

mi

ఐతే కరోనా నుండి కాపాడుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, సరైన ఆహారాన్ని తీసుకోవాలని అందరూ చెబుతూనే ఉన్నారు. తాజా అధ్యయనం ప్రకారం సైక్లింగ్ చేయడం ద్వారా కరోనా నుండి కాపాడుకోవచ్చని తెలిసింది. కరోనా టైమ్ లో సైక్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్వాస వ్యవస్థని మెరుగు పరుస్తుంది.

కరోనా వైరస్ శ్వాస వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఊపిరితిత్తుల మీద దాడి చేసి వాటి పనితీరును తగ్గిస్తుంది. అందుకే ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పరచడానికి సైక్లింగ్ బాగా పనిచేస్తుంది. కరోనా నుండి రికవరీ అయిన వాళ్ళు కూడా సైక్లింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

హృదయరోగం, మధుమేహం, బీపీ వంటి వ్యాధులు ఉన్నవారికి కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సైక్లింగ్ చేయడం వల్ల హృదయ ఆరోగ్యం మెరుగు పడి ఆరోగ్యమైన స్పందనలు ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో సైక్లింగ్ కీలక పాత్ర వహిస్తుంది.

శరీరంలో కొవ్వు పెరగకుండా సాయ పడుతుంది. అధిక కొవ్వు అనేక అనర్థాలకి దారి తీస్తుంది. ఊబకాయుళల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ అనే మాటలు కూడా వినిపించాయి. అందుకే దాన్నుండి బయట పడడానికి సైక్లింగ్ చేయడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news