బ్ల‌డ్‌లో ప్లేట్ లెట్స్ అభివృద్ధి చేసే బెస్ట్ ఫుడ్‌..

-

చాలా మంది ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో హాస్పిటల్స్ బారిన ప‌డుతున్నారు. దీనికి ముందు నుంచి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే చాలా ప్ర‌మాద‌క‌రం. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి.

ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. డేంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అయితే రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు ఇప్పుడు తెలుసుకుందాం.

best fruits and vegetables for increasing platelets                     Photo Source : NEWS YALE

ఖర్జూరం – ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

బొప్పాయి- బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

ఆప్రికాట్- ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

క్యారెట్- క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

బీట్ రూట్- ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

best fruits and vegetables for increasing platelets
best fruits and vegetables for increasing platelets

ఆకుకూరలు- శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

ఎండు ద్రాక్ష- రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

దానిమ్మ- ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

వెల్లుల్లి- శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news