ఈ గ్రూప్ రక్తం ఉంటే బ్లడ్ క్లాట్స్ మరియు గుండెపోటు ఎక్కువ వస్తాయట..!

-

మనందరి బ్లడ్ గ్రూప్స్ వేరు వేరుగా ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్ లో ఏ, బి, ఏబి, ఓ ఇలా నాలుగు రకాలు ఉంటాయి. బ్లడ్ లో వుండే యాంటీజన్స్ ని బట్టి బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. అయితే ఈ నాలుగు బ్లడ్ గ్రూపులు కూడా వేరు వేరుగా ఉంటాయి.

 

అలానే బ్లడ్ లో ఉండే ఆర్హెచ్ ఫ్యాక్టర్ (RH) ని బట్టీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఆ లేదా నెగిటివ్ ఆ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక ఒక మనిషి యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అయితే ఈ RH ఫ్యాక్టర్ ని బట్టి అది ఏ పాజిటివ్ ఆ… నెగిటివ్ ఆ అనేది ఉంటుంది.

తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం బ్లడ్ గ్రూప్ ఏ, బి ఏబి ఉన్న వాళ్లకి ఎక్కువ హార్ట్ ఎటాక్ సమస్యలు కలిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం త్రొమ్బోసిస్, వాస్కులర్ బయాలజీ అనేది ఏ, బి గ్రూప్స్ వాళ్ళకి ఎనిమిది శాతం వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఓ గ్రూప్ తో పోల్చి చూస్తే వీళ్ళకి ఎక్కువగా హార్ట్ఎటాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ గ్రూపుల వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఈ ఆహార పదార్థాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి:

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

చియా సీడ్స్: చియా సీడ్స్ని తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది కావాలంటే మీరు ఓట్స్ తో కలిపి వీటిని తీసుకోవచ్చు.

పుట్టగొడుగులు: పుట్టగొడుగులు తిన్నా గుండె ఆరోగ్యం బాగుంటుంది. కనుక డైట్ లో అప్పుడప్పుడు తీసుకోండి.

సాల్మన్ ఫి: ష్ సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.

ఓట్స్: ఓట్స్ ను తీసుకోవడం వల్ల కూడా గుండె సమస్యలు రావు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఓట్స్ ను కూడా తరచూ తీసుకుంటూ ఉండండి,

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లో కూడా గుండెపోటుని తగ్గించే గుణాలు ఉంటాయి. అలానే సిట్రస్ ఫ్రూట్స్, సోయాబీన్స్, నట్స్ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news