చెవుల్లో గులిమి తీసేందుకు హైడ్రోజన్‌ పెరాక్సైడ్ వాడొచ్చా..?

-

చెవుల్లో గులిమి తీసుకోవడం గురించి కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు.. కానీ చెప్పాలి.. ఈరోజుల్లో ఎవ్వరూ ఈ విషయంలో సరైన పద్ధతి పాటించడం లేదు.. బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో గులిమి తీసే వాళ్లు ఉంటారు.. కొంతమంది వారి దగ్గర తీయుంచుకుంటారు. అసలు ఇది మంచి అలవాటు కాదు.. అదొక పెద్ద స్కామ్.. ఇక కొంమంది అయితే.. ఇయర్‌ బడ్స్‌ ఉపయోగించి తెగ తిప్పేస్తుంటారు.. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వినికిడి సమస్య వస్తుంది. కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి గులిమి తీసుకుంటే.. మీ చెవులకు ఎలాంటి ప్రమాదం ఉండదు..

- Advertisement -

ఒక చిన్న గ్లాస్‌లో 60 ఎంఎల్ మోతాదులో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత డ్రాప‌ర్ స‌హాయంతో ఒక్కో చెవిలో 5 నుంచి 10 చుక్క‌లు ఆ మిశ్ర‌మాన్ని వేయాలి. అనంత‌రం ఒక గంట సేపు అయ్యాక శుభ్ర‌మైన నీళ్ల‌తో చెవుల‌ను క‌డిగేయాలి. ఇలా 2 రోజుల‌కు ఒక‌సారి చేయాలి. చెవి మొత్తం శుభ్రం అయిందని అనుకునే వ‌ర‌కు 2 రోజుల‌కు ఒక‌సారి ఇలా చేయ‌వ‌చ్చు. అయితే 4 సార్లు ఈ విధంగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అంత‌క‌న్నా ఎక్కువ సార్లు ఈ చిట్కాను ట్రై చేయ‌కూడ‌దు.

ఇక బేకింగ్ సోడాకు బ‌దులుగా కొబ్బ‌రినూనె లేదా ఆలివ్ నూనెను వాడ‌వ‌చ్చు. ఏదైనా ఒక నూనె తీసుకుని 5 నుంచి 10 చుక్క‌ల‌ను ఒక్కో చెవిలోనూ వేయాలి. ఒక గంట సేపు అయ్యాక క‌డిగేయాలి. తలస్నానం చేసే ముందు ప్రతిసారి ఇలా చేయడం వల్ల చెవిలో ఎలాంటి డెస్ట్‌ ఉన్నా నానిపోయి వచ్చేస్తుంది.

హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ మిశ్ర‌మాన్ని కూడా చెవుల‌ను క్లీన్ చేసేందుకు వాడ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని కూడా 5 నుంచి 10 చుక్క‌ల మోతాదులో ఒక్కో చెవిలోనూ వేయాలి. కానీ కేవ‌లం 5 నిమిషాలే ఉంచాలి. త‌రువాత క‌డిగేయాలి. ఇలా 14 రోజుల్లో 3 సార్లు చేయ‌వ‌చ్చు. దీంతో చెవుల్లోని గులిమి పోతుంది. చెవులు శుభ్ర‌మ‌వుతాయి. చెవుల్లో ఉండే దుర‌ద త‌గ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...