షుగర్ వున్నవాళ్లు మద్యం తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..?

-

Sugar: చాలామంది మద్యం తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ కి చాలా మంది అడిక్ట్ అయిపోయారు ఈరోజుల్లో చాలామంది బాధపడుతున్న సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. అయితే షుగర్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ని తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే విషయాన్ని చూద్దాం ఈరోజుల్లో చిన్న వయసు వాళ్ళు మొదలు పెద్ద వయసు వాళ్ల వరకు షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది అలానే మద్యం తీసుకున్నాక షుగర్ టాబ్లెట్లు వేసుకోవచ్చా లేదా అనేది కూడా చాలా మందిలో ఉండే సందేహం మద్యం తాగిన తర్వాత టాబ్లెట్స్ ని వేసుకోవడం వలన నాడులు దెబ్బతింటాయని వైద్యులు అంటున్నారు.

Sugar
Sugar

షుగర్ పేషెంట్ల లో ఎక్కువగా నాడులు దెబ్బ తినే సమస్య ఉంటుంది. చాలా ఏళ్ల నుండి మద్యం తీసుకుంటే ఎక్కువగా నాడలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది దీంతో చాలా మందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం మంట పెట్టడం సూదులు పొడిచినట్లు అనిపించడం వంటివి జరుగుతాయి దీంతో పాటుగా షుగర్ ఉంటే తీవ్రమౌతుంది అందుకని కాళ్లు పండ్లు పుట్టడం వంటివి జరుగుతాయి ఎప్పుడైతే మద్యం తాగాల్సి వస్తుందో అప్పుడు ముందు భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి. ఆ తర్వాత తాగొచ్చు.

మద్యం తాగిన తర్వాత భోజనం చేయకపోతే మందులు అసలు వేసుకోకూడదు. కాలేయం నిరంతరం గ్లూకోస్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. గ్లూకోస్ కూడా స్థిరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఇబ్బందులని కలిగిస్తుంది. దీంతో శరీరానికి తగ్గ గ్లూకోజ్ ఉత్పత్తి అవ్వదు. సమస్యలు కలుగుతూ ఉంటాయి. మద్యం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుంది షుగర్ పేషెంట్లు మందులతో పాటు మద్యం తీసుకుంటే సమస్య మరింత ఎక్కువవుతుంది మద్యంతో మందులు తీసుకుంటే ఛాతిలో నొప్పి వాంతులు వంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అస్సలు మద్యం తీసుకోవద్దు. ఎవరైనా సరే మద్యం తీసుకోవడం మంచిది కాదు మద్యం తీసుకోవడం వలన రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఆల్కహాల్ కి షుగర్ పేషెంట్లు దూరంగా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news