ఉదయాన్నే అరటి పండు తినవచ్చా?

ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం శరీరంలోని మినరల్ స్థాయిని సమతుల్యపరిచి, శరీరాన్ని ఆరోగ్యంతో ఉంచుతుంది.అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉదయాన్నే తీసుకునే అల్పాహారం విషయంలో అశ్రద్ధను కనపరుస్తున్నారు.

మనలో చాలామంది ఉదయం అల్పాహారానికి బదులు ఒకటో రెండో అరటి పండ్లలతో సరిపెడుతున్నారు. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో అరటి పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏమంతా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ రోజుల్లో సహజసిద్ధమైన పండ్లను తెలుసుకోవడం చాలా అరదు. మనం తినే పండ్లు ఎక్కువగా రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారు. కాబట్టి అలాంటి పండ్లను మనం ఖాళీ కడుపుతో తినేటప్పుడు ఈ రసాయనాలు మన శరీరం లోకి నేరుగా ప్రవేశిస్తాయి. అందువల్ల ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. అరటి పండులో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండును తినడం వలన ఇది శరీరంలోని మినరల్స్ స్థాయిని తగ్గిస్తుంది.అందువల్ల ఉదయాన్నే అరటి పండ్లు తినడం మానేయడం చాలా ఉత్తమం.

అరటిపండ్లు అనేది చాలా మంచి అల్పాహారము. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. అలసట,మలబద్ధకం కడుపులో ఏర్పడే అల్సర్ వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అయితే ఈ పోషక ప్రయోజనాలు అన్ని పొందాలంటే మీరు సరైన సమయంలోనే అరటిపండును తినడం మంచిది. ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో ఆమ్లత్వమునకు దారితీసి పేగు సమస్యలను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఖాలీ కడుపుతో అరటిపండు తినడం వలన మనలో ఉన్న చురుకుదనాన్ని తగ్గించి నిద్రావస్త అనుభూతిని కలిగిస్తుంది.

అరటిపండు ఎక్కువ మొత్తంలో చక్కెర నిల్వలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే ఖాలీ కడుపుతో అరటిపండును తినడం వలన కొన్ని గంటల వ్యవధిలోనే పొందిన శక్తి క్రమంగా క్షణించిపోతుంది.అందువల్ల అరటిపండును ఇతర అల్పాహారాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.