Masturbation : హస్తప్రయోగం వల్ల బరువు తగ్గుతారా..?

-

ఒక వయసు వచ్చినప్పటి నుంచి అబ్బాయిలకు సెక్స్‌ హార్మోన్స్‌ రిలీజ్‌ అవుతాయి. సెల్ఫ్‌గా సంతృప్తి పొందడానికి హస్తప్రయోగం చేసుకుంటారు. దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. హస్తప్రయోగం లైంగిక ఒత్తిడిని తొలగించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కానీ హస్తప్రయోగం చేయడం వల్ల బరువు తగ్గుతారు అని కొంతమంది నమ్ముతున్నారు. నిజంగానే తగ్గుతారా..? ఇది కేవలం అపోహనా లేక నిజమేనా..వైద్యులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

యువకులు వారానికి 3-4 సార్లు హస్తప్రయోగం చేయడం చాలా సాధారణం. 30-40 సంవత్సరాల వయస్సు ఉన్న వారు వారానికి 1-2 సార్లు కూడా చేస్తారు. అయితే హస్తప్రయోగం వల్ల బరువు తగ్గడం జరుగుతుందా? అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంటుంది. ఇందులో నిజం లేదు. బరువు తగ్గడం, హస్తప్రయోగం మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని నిరూపించడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు. ఒక వ్యక్తి తన శక్తి అవసరాల కంటే రోజుకు తక్కువ కేలరీలు తీసుకుంటే.. బరువు తగ్గుతారు. మీరు హస్తప్రయోగం చేస్తే, అది తక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అందువల్ల, హస్త ప్రయోగం బరువు తగ్గడానికి దారితీస్తుందనేది కేవలం అపోహ మాత్రమే.

హస్తప్రయోగం వల్ల బరువు తగ్గరు. అయితే ప్రతిదీ ఎక్కువగా చేస్తే.. ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మాత్రం తెలుసుకోవాలి. అందువల్ల, మీరు ప్రతిరోజూ చాలాసార్లు హస్త ప్రయోగం చేసుకుంటే, ఈ అలవాటును నియంత్రించుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది మీ జననాంగాలకు హాని కలిగిస్తుంది. స్పెర్మ్ విడుదల చేయడం వల్ల బరువు తగ్గరు. లైంగిక కార్యకలాపాలు హృదయ స్పందన రేటును పెంచుతాయి. కొన్ని కేలరీలను బర్న్ చేస్తాయి. లైంగిక కార్యకలాపాల సమయంలో బర్న్ చేయబడిన కేలరీల సంఖ్య సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి అది ఏమాత్రం సరిపోదు. బరువు తగ్గడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, క్యాలరీ వినియోగాన్ని తగ్గించడం అవసరం. ఇది ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ వ్యాయామం ద్వారా అవుతుంది.

హస్తప్రయోగం వల్ల శరీరం నుంచి ఆక్సిటాక్సిన్, ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. మనస్సును రిలాక్స్ చేయడంలో, శరీరానికి దాని నుంచి చాలా ప్రయోజనాలు లభిస్తాయని అనేక పరిశోధనలలో నిరూపితమైంది. భావప్రాప్తి వల్ల శరీరంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news