మొలకలు వచ్చిన బొబ్బర్లు తినలేకపోతున్నారా..అయితే ఇలా ట్రై చేయండి..!

-

పెసలు, బొబ్బర్లు, శనగలు మొలకలు కట్టుకుని తీసుకుంటారు. ఇందులో బొబ్బర్లు గురించి తెలుసుకుందాం. వాటిలో ఉండే పోషకాలు ఏంటి, నిత్యం తినటం వల్ల ఏం ఏం లాభాలు కలుగుతాయి, ఎంత ప్రొటీన్ వస్తుంది అనేది చూద్దాం.

విత్తనాలు మొలకకట్టినప్పుడు తినేప్పుడు చాలా విత్తనాలు కాస్త గట్టిగా ఉంటాయి. ఎక్కువ తినలేరు. ఇలాంటి ఇబ్బంది లేకుండా..మెత్తగా ఉండి..ఎక్కువగా తింటానికి, తేలిగ్గా డైజెషన్ అ‌వడానికి బొబ్బర్లు చాలా బాగా ఉపయోగడతాయి.

100 గ్రాముల బొబ్బర్లలో ఉండే పోషకాలు
నీటిశాతం 14 గ్రాములు
పిండిపదార్థాలు 54 గ్రాములు
మాంసకృతులు 24 గ్రాములు
కొవ్వు 1 గ్రాము
పీచుపదార్థాలు 4గ్రాములు
శక్తి 323 కాలరీలు
ఐరన్ 9 మిల్లీ గ్రాములు

రక్తపుష్టికి, బలానికి బాగా ఉపయోగపడుతుంది. చేపలు, చికెన్ లో కంటే ఎక్కుగా ప్రొటీన్ బొబ్బర్లలో ఉంటుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్. వృక్షసంబంధమైన మాంసకృతులు ఆరోగ్యానికి చాలా మంచిది.

బొబ్బర్లు కాయలు కాసినప్పుడు బర్బాటీలు అని వెజిటబుల్ షాపుల్లో అమ్ముతారు. వీటిని కర్రీ చేసుకోవడానికి చక్కగా వాడుకోవచ్చు. సాధరణంగా వెజిటబుల్స్ లో కాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ బర్బాటీస్ లో కాలరీలు ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఇవి మొలకలుగా తిన్నప్పుడు, ఉడకపెట్టినప్ుడు తిన్నప్పుడు అరగవు, గ్యాస్ అంటుంటారు..అలాంటివారు తేలిగ్గా డైజెషన అవ్వాలి, ప్రొటీన్ కావాలనుకుంటే..ఈ బర్భాటీస్ కొనుక్కోని..వారంలో రెండుసార్లు కర్రీ చేసుకుని తినొచ్చు. మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. పుల్లమజ్జిగలో వేసి ఉడికించి..పచ్చికొబ్బిరి వేసి ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ బొబ్బర్లను మొలకలు కట్టినప్పుడు కూడా సులువుగా వచ్చేస్తాయి. అంగుళం నుంచి రెండు అంగుళాల వరకూ వచ్చేట్లు చేసుకుని తింటే..పోషకాలు బాగా అందుతాయి. ఇందులో మినరల్స్ కూడా 3.5 గ్రాములు వరకూ ఉంటాయి. డైజెషన్ కు కూడా బాగా ఉపయోగపడుతుంది. మొలకలు కట్టినప్పుడు నమలలేనివారు, ఫ్రష్ టేస్ట్ ను ఇష్టపడనివారు, దంతాల సమస్యతో బాధపడేవారు..మొలకలు వచ్చినబొబ్బర్లను మరిగే వేడినీళ్లలో వేసి..నాలుగైదు నిమిషాలు వేసి మరిగిస్తే చాలు వాటికి మీగడ వేసి తాలింపు పెట్టుకుంటే చాలు..అలా ఉడకపెట్టిన బొబ్బర్లను అలా తీసుకోవచ్చు.

గుంగిల్లు అందరికీ తెలిసే ఉంటుంది. బొబ్బర్ల గుగ్గిళ్లు చాలా మంచిది. 10-12 గంటల పాటు నానపెట్టుకుని ఉడకపెట్టుకోండి. ఉడికించేప్పుడే..టమోటా జ్యూస్ లేదా..పుల్లపెరుగు వేసి ఉడకించుకోవచ్చు. అలా ఉడికినప్పుడు ఆ గింజల్లో ఉండే చప్పదనం పోయి..ఈ రసాలు పీల్చుకుని టేస్టీగా అవుతాయి. పోషకాలు కూడా బాగా అందుతాయి ఉడికిన వాటిని ఎండుమిరపకాయ, వెల్లుల్లి, జిలకర్ర వేసి తాలింపు పెట్టుకుని కాస్త చాట్ మసాల వేసుకుని నిమ్మరసం వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు పెట్టిన ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోసలు తినేకంటే..ఇలాంటివి చేసి పెట్టొచ్చు. ఒకరోజు బొబ్బర్లు, ఒకరోజు శనగగలు, ఒకరోజు సోయాబీన్స్, బొబ్బర్లు, బఠానీలు వేసి పెట్టొచ్చు. మంచిఆహారం తిన్నట్లే..

బొబ్బర్ల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి..ఇన్ని రకాలుగా వాడుకుంటే శరీకానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి మంచి వాటిని..ఏదో ఒక సాకు చెప్పి మనం తినకుండా ఉంటాం..కానీ ఇలా వివిధరకాలుగా వాడుకోవచ్చని తెలిశాక..ఇంకెందుకు లేట్..ఉపయోగించేయండి..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news