మొక్కజొన్న వలన ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు…!

-

మనకి మొక్కజొన్న విరివిగా దొరుకుతూనే ఉంటుంది. కేవలం మనదేశం లోనే కాదు చాలా దేశాల్లో మొక్క జొన్నలని ఉపయోగిస్తారు. ఇది మంచి ఆహార ధాన్యం. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు చాలానే కలుగుతాయి. మొక్క జొన్నని ఉడక బెట్టుకు తిన్న, కాల్చుకునైనా తినొచ్చు. దీని గింజల నుంచి పేలాలు, పాప్ కార్న్, కార్న్ ఫ్లెక్స్ లాంటివి తయారు చేస్తారు. అలాగే బేబీ కాలనీ వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఎలా చేసుకున్న మంచి రుచి ఆరోగ్యం కలుగుతుంది.

దీని నుండి విటమిన్ b1 , b6 , ఫాలో యాసిడ్ కూడా ఉంటాయి. విటమిన్ డి కూడా దీనిలో పుష్కలంగా ఉంటుంది. మరి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కోసం పూర్తిగా చూసేయండి. మొక్కజొన్న లో పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలానే మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

మనకి కావాల్సిన లవణాలు లేదా మినరల్స్ ఇందులో ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఇందులో ఉండటం వల్ల ఇది ఎముకలు గట్టి పడేలా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉండడానికి కూడా ఉపయోగ పడుతుంది. దీని విత్తనాల నూనె చర్మానికి రాస్తే చర్మం పై ఏర్పడే మంటలు కూడా తగ్గుతాయి. చూశారా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో..! మరి మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news