కరోనా జాగ్రత్తలు ఇవే, వేరే వాళ్ళను తాకే ముందు ఆలోచించండి…!

-

ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎబోలా తరహాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక భారత్ కి కూడా ఈ వ్యాధి వచ్చిందనే ప్రచారం నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ, అసలు వ్యాధి ఏ విధ౦గా వ్యాపిస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఈ వ్యాధి సోకినా వారికి జలుబు చేసి ముక్కు కారుతూనే ఉండటంతో పాటుగా గొంతు అంతా తీవ్రమైన మంటగా ఉంటుంది. ఏమీ తిన బుద్ధి కాదు. అలాగే తీవ్రమైన తలనొప్పి రావడంతో పాటుగా జ్వరం, అది వచ్చిన వెంటనే దగ్గు మొదలవుతుంది. మీరు నీరసంగా ఉంటారు. ఇలా వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది కాబట్టి, వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గర ఉండకుండా ఉండటం మంచిది. వాళ్ళు వాడే వస్తువులను వాడకుండా, వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ఆలింగానాలు, ముద్దులు లేకుండా జాగ్రత్తలు పడాలి. వైరస్ కి వేగంగా వ్యాపించే గుణం ఉంది.

చేతులు కడిగే లోపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వైరస్ కి మందు లేదు కాబట్టి నిత్యం సబ్బుతో చేయి కడుక్కోవడంతో పాటుగా ఇతరుల కళ్ళను గాని, ముక్కుమ నోటిని మీరు తాకవద్దు. జ్వరం అలాంటివి వస్తే మాత్రం జనంలోకి వెళ్ళకుండా ఎక్కువ నీళ్ళు తాగి ఇంట్లోనే ఉండండి. జ్వరం తగ్గకపోతే మంచి వైద్యుడ్ని కలవండి.

Read more RELATED
Recommended to you

Latest news