మహమ్మారి సమయంలో ఇతర వ్యాధుల పట్ల నిర్లక్ష్యం.. పెరుగుతున్న మరణాలు..

-

సంవత్సర కాలంగా కరోనా కారణంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. కరోనా బారిన పడి ఎందరో మరణించారు. కానీ, మీకిది తెలుసా? కరోనాతో పాటు ఇతర వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. కరోనా వల్ల ఇతర ఇబ్బందులు ఉన్నవారు బయటకి రాకపోవడం, ఆస్పత్రుల్లో కరోనా అంటుకుంటుందేమోనన్న భయంతో వైద్యులని సంప్రదించకుండా ఆలస్యం చేస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా ఇతర వ్యాధులు ముదిరి ప్రాణాంతకంగా మారుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎలాంటి వ్యాధులున్న వారు ఆలస్యం చేయకూడదంటే,

నాడీ సంబంధిత వ్యాధులు, గుండెపోటు, నిమోనియా, క్యాన్సర్లు, ఆస్తమా, లివర్ సిర్రోసిస్, టీబీ, అపెండిసైటిస్, హెపటైటిస్, మూత్రపిండ వ్యాధులు, ఒత్తిడి, హైబీపీ, డయాబెటిక్, ఎపిలెప్సీ ఇంకా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వైద్యం చేయించుకోవడంలో ఆలస్యం చేయకూడదు. అదీగాక డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఈ మహమ్మారి సమయంలో ఎక్కువగా వస్తున్నాయి.

కరోనా కారణంగా ఆస్పత్రులకి రద్దీ పెరగడంతో ఇతర వ్యాధుల పట్ల చికిత్స ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఆ వ్యాధులు ముదిరి ప్రాణాంతకంగా మారుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియో థెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల్లో ఆలస్యం చేస్తుండడం ఇబ్బందిగా మారుతుంది. పరిస్థితి మరీ అదుపు తప్పితేనే ఆస్పత్రికి వెళ్దామన్న ఉద్దేశ్యంలోనే జనాలు ఉన్నారు.

ఇతర ఇబ్బందులు ఉన్నవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి.

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, హైబీపీ, ఎక్కువ చెమట లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఆస్పత్రిని సంప్రదించండి.

కీమోథెరపీ, రేడియో థెరపీ వంటి విషయాల్లో ఆలస్యం చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news