ఫ్రిజ్‌లో వీటిని పెట్టకండి.. అవి విషం కంటే డేంజర్..!

గతంలో ప్రతిఒక్కరూ టైం టు టైం ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుని తినేవారు. కాలం మారింది.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని ఆహారాల పదార్థాలు ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా ఫ్రిజ్ అందుబాటులోకి వచ్చాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినే అలవాటు చేసుకున్నారు. ఫ్రిజ్‌లో కేవలం ఆహార పదార్థాలే కాదు, కూరగాయలు, గ్రుడ్లు, నీళ్లు, పాలు ఇలా అన్ని రకాల తిండి పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే వేసవి కాలంలో ఈ పదార్థాల సంఖ్య ఎక్కువే కనిపిస్తుంది. ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఆహార్థాలు తొందరగా పాడైపోయే లక్షణం ఉంటుంది. అందుకే చాలా వరకు పదార్థాలను ఫ్రీజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే.. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటే ఆరోగ్యానికే ప్రమాదమని, ఆ పదార్థాలు విషంతో సమానమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రిజ్-కూరగాయలు
ఫ్రిజ్-కూరగాయలు

ఎండాకాలంలో కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి తీసుకుంటే చాలా ప్రమాదాలు తలెత్తుతాయని, దీన్ని వల్ల అనారోగ్యానికి గురవుతారని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ పదార్థాలెంటో.. వాటిని ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టుకోకూడదో తెలుసుకుందాం..
వేసవి తాపం తగ్గించుకునేందుకు చాలా మంది పుచ్చకాయలను ఇంటికి తీసుకొస్తుంటారు. ఒకేసారి 2-3 పుచ్చకాయలను తీసుకొచ్చి.. తిన్నంత తిని మిగిలిన దానిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే కోసిన పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను తింటే ఆరోగ్యానికి హానికారకమంటున్నారు. అలాగే వంటల్లో విరివిగా వాడే ఉల్లిపాయలను కూడా కొందరు కోసి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు విషంతో సమానం. వీటిని ఫ్రిజ్‌లో పెడితే దీని వాసన వేరే ఆకుకూరలకు వ్యాప్తి చెంది.. అవీ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

అలాగే కొందరు తేనెను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. స్వచ్ఛమైన తేనె బయట ఉన్నా పాడైపోదు. అదే ఫ్రిజ్‌లో పెడితే దాని లక్షణం మారిపోతుంది. తేనె గడ్డకట్టి చక్కెరలా మారిపోతుంది. ఇంకా అరటి పండ్లను కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవద్దు. అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టుకోవడం వల్ల త్వరగా పాడైపోతాయి. దీంతోపాటు వీటిలో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. అలాగే మల్లెపూలు, లిల్లీ వంటి పువ్వులను కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవద్దు. వీటి వాసనకు ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు పాడైపోతాయి. అలాగే పచ్చళ్లు, బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టుకోవద్దు. చల్లదనం వల్ల పచ్చళ్లు తొందరగా పాడైపోతాయి. బంగాళదుంపల్లో చల్లదనం వల్ల చక్కెర స్థాయి పెరిగి తినడానికి పనికి రాకుండా పోతాయి.