భుజం నొప్పి ఉంటోందా..? తగ్గాలంటే ఇలా చెయ్యండి..!

-

భుజం నొప్పి: చాలామంది భుజం నొప్పితో బాధ పడుతూ ఉంటారు మీరు కూడా భుజం నొప్పితో బాధపడుతున్నారా..?అయితే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. షోల్డర్ ఆర్థరైటిస్ వలన ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది భుజం కీలులో మృదులాస్థి, వాపు క్షీణత ద్వారా వచ్చే సమస్య. అయితే ఈ సమస్య ఉంటే కదల్లేకపోవడం, భుజం నొప్పి, భుజం గట్టిగా మారిపోవడం ఇటువంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. షోల్డర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి దీనికి గల కారణం ఏంటి.. ట్రీట్మెంట్ ఏంటి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది షోల్డర్ ఆర్థరైటిస్. ఇది అత్యంత సాధారణ రూపం. సాధారణంగా రోజులు గడిచే కొద్దీ ఇది తగ్గిపోతుంది. కీళ్ళనొప్పులు, దృఢత్వానికి దారితీస్తుంది ఇది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇమ్యూనిటీ వ్యవస్థ భుజం కీలుతో సహా కీళ్ళ లైనింగ్‌పై ఇది దాడి చేస్తూ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏం అవుతుంది అంటే మంట, నొప్పి, మృదులాస్థికి సమస్య వస్తుంది. అదే పోస్ట్ ట్రమాటిక్ ఆర్థరైటిస్ లో చూస్తే భుజానికి ఏదైనా గాయం అయినప్పుడు కనిపిస్తుంది.

ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి..?

భుజం నొప్పికి ఐస్ ప్యాక్స్ పెడితే చాలా బాగా పని చేస్తాయి. రోజుకి రెండు సార్లు వాడుకోవచ్చు.
ఈ నొప్పి ని తగ్గించేందుకు భుజం ముందు, పై భాగం, వెనుక భాగం లో ఐస్ ప్యాక్ ని పెట్టండి.
ఒకేసారి 20 నుండి 30 నిమిషాల వరకూ పెడుతూ ఉంటే ఉపశమనం ఉంటుంది. ఒకవేళ నొప్పి వలన రాత్రి నిద్ర లేకపోతే పడుకునే ముందు భుజానికి ఐస్ రాయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news