పరిగెత్తి పాలు తాగడం కంటే.. నిలబడి నీళ్లు తాగడం మేలు అని నానుడి.. ఆయుర్వేదం ప్రకారం.. అసలు నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదట..బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే.. వాటర్ తాగాలని మనకు తెలుసు..కానీ ఆ వాటర్ తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని చాలా మందికి తెలియని విషయం. ఏ భంగిమలో నీళ్లు తాగితే ఏం ప్రయోజనాలు ఉంటాయో కూడా మనకు ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పారు.
నిలబడి నీళ్లు ఎందుకు తాగకూడదు :
నిలబడి నీళ్లు తాగినప్పుడు మీకు అవసరమైన పోషకాహారం లభించదు. నీరు.. సరైన పద్ధతిలో తీసుకోకపోతే.. మీకు జరిగే.. మంచి కన్నా చెడు ఎక్కువ.బాగా దాహం వేసినప్పుడు మనకు తెలియకుండానే వాటర్ స్పీడ్‌గా తాగేస్తుంటాం. కానీ అలా అసలు చేయకూడదు. నిలబడిన సమయంలో నీటిని ఎత్తి పోసుకుని మరి తాగుతుంటారు. అలా చేయడం వల్ల నీరు నోటిలోనుంచి శరీరంలోకి నేరుగా వెళ్లిపోతుంది. అప్పుడు నీళ్లు అందాల్సిన అవయాలకు చేరదు. తద్వారా బయటకు వెళ్లాల్సిన మలినాలు, కిడ్నీలు, బ్లాడర్‌లోనే చేరుతాయి. వెల్‌నెస్ కోచ్, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు నికితా పర్మార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
నరాలను ప్రేరేపించవద్దు..
లేచి నిలబడి నీరు తాగడం వల్ల శరీరం నేచర్‌కు తగినట్టుగా ఉండదు. అప్పుడు ఆ ప్రభావం నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ పెరిగి రక్తపోటు వంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాదు.. పోషకాలు వృధా అవుతాయి. మీ శరీరం ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది.
దాహం తీరదు..
నిలబడి నీళ్లను తాగడం ద్వారా పోషకాలు అందకపోగా.. మీ దాహం కూడా తీరదు. ఫలితంగా నీరు నేరుగా వెళుతుంది. విటమిన్లు, కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. ఎందుకంటే మీరు నిలబడి తాగినప్పుడు అది నాడి వ్యవస్థ ద్వారా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఫలితంగా మీరు మీ ఊపిరితిత్తులు, గుండె పనితీరుకు ముప్పు ఏర్పడుతుంది. ఆక్సిజన్ స్థాయిలు కూడా భారీగా తగ్గిపోతాయి.
నిలబడి నీళ్లు తాగే సమయంలో చాలామంది ఒక్కో రకమైన భంగిమలో ఉంటారు. అప్పుడు వారు ఏయే భంగిమలో నిలబడతారో అప్పుడు దానిపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆ సమయంలో శరీరంలోకి నీరు వేగంగా ప్రవహించడం వల్ల ఎముకలు, కీళ్లకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కీళ్ల నొప్పులు, ఎముకల క్షీణత, బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే నీటిని మెల్లగా నెమ్మదిగా తాగాలి.
కూర్చున్న చోటే నీళ్లు తాగండి :
కుర్చోనే నీళ్లు తాగాలి.. ఇదే సరైన పద్ధతి. మీరు కూర్చుని మీ భోజనం చేయమని కూడా అందుకే చెబుతుంటారు. మీరు కూర్చుని మీ వీపును నిటారుగా ఉంచినప్పుడు గరిష్ట స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కూర్చొని నీటిని తాగినప్పుడు.. పోషకాలు మెదడుకు చేరుతాయి. ఫలితంగా మెదడు పనితీరును మెరుగుపరుతుంది.. మెరుగైన జీర్ణక్రియకు సాయపడతాయి. నీరు తాగిన తర్వాత మీకు పొట్ట ఉబ్బినట్లు అనిపించకుండా ఉంటుంది.
సో ఇదీ విషయం.. కాబట్టి ఇకనుంచి అయినా నిలబడి నీళ్లు తాగే అలావాటు ఉంటే మానేయండి..!