ఒంటె పాలు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మందికి అవగాహన లేదు మరి నిజంగా ఒంటె పాలు తాగితే ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
ఒంటె పాలు తాగితే కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఒంటె పాలు ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుండి పోరాడటానికి సహాయం చేస్తాయి. ఒంటె తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పైగా ఒంటె పాలు తాగడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తో ఒంటె పాలు ఫైట్ చేస్తాయి.
మిల్క్ ఎలర్జీ ఉంటే తాగచ్చు:
చాలా మందికి పాలంటే ఎలర్జీ ఇటువంటి వాళ్లు సాధారణ పాలు కాకుండా ఒంటె పాలు తీసుకోవచ్చు కూడా. ఒంటె పాలలో ప్రోటీన్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి కనుక పాలు అంటే నచ్చని వాళ్ళు పాలు పడని వాళ్ళు దీనిని తీసుకోవచ్చు.
ఆటిజం లక్షణాలు తగ్గుతాయి:
కొన్నిచోట్ల ఆటిజమ్ సమస్య పరిష్కరించుకోవడానికి ఒంటె పాలను తీసుకుంటారు. రెగ్యులర్ గా ఒంటె పాలని ఆటిజం ఉన్న పిల్లలు తీసుకుంటే చక్కటి ఫలితాలు కనపడ్డాయి. ఆటిజంతో బాధపడే పిల్లలకు మంచి నిద్ర, మంచి భాష వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఐ కాంటాక్ట్ ని కూడా ఆటిజం పిల్లలు మెయింటైన్ చేయడానికి అయ్యింది. కాగ్నెటివ్ మరియు బిహేవియర్ పాటర్న్స్ లో మార్పులు వచ్చాయి.
డయాబెటిస్ తగ్గింది:
ఒంటె పాలు తీసుకునే వారిలో డయాబెటిస్ కూడా తగ్గింది అంతేకాకుండా ఇందులో క్యాల్షియం ఉండటం వల్ల పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి.
అభివృద్ధి జరిగింది:
ఎదిగే పిల్లలు బాగా ఉండాలంటే ఈ పాలు సహాయం చేస్తాయి. ప్రోటీన్ల లోపం నుండి కూడా బయటపడొచ్చు.