విటమిన్ C లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా? ఈ లక్షణాలకు అదే కారణమట..!

-

మంచి ఆరోగ్యానికి కావాల్సింది మంచి నిద్ర, మంచి ఆహారం. ఇవి రెండూ మనిషికి సమృద్ధిగా అందితే..సగానికి సగం రోగాలు దరిచేరవు. మన శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సిన పోషకాల్లో విటమిన్ సీ ఒకటి చాలా అవసరం. మహిళలలు విటమిన్ సీ ఉండే ఆహారాన్ని ప్రతిరోజు 75 మిల్లీ గ్రాములు తీసుకోవాలంటుంటారు వైద్యులు. అదే పరుషులైతే 90 మిల్లీ గ్రాములు తీసుకోవాలట. ఈ క్యాంటిటీ కంటే తక్కువ తీసుకుంటే మనకు విటమిన్ సీ లోపం వస్తుంది. విటమిన్ సీ లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయట. వాటిల్లో ప్రధానంగా వచ్చేవి అలసట, దంతక్షయం, జాయిట్ పెయిన్ . ఇవే కాకుండా మరికొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందట..అవేంటో ఇప్పుడు చూద్దాం.

1.చర్మ వ్యాధులు

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్ సి ముఖ్యపాత్ర పోషిస్తుందని మన అందరికి తెలిసిన విషయమే.. స్కిన్ కి మంచి గ్లోయింగ్ రావాలంటే మహిళలు ఎక్కువగా విటమిన్ సీ ఉన్న క్రీమ్స్ నే వాడుతుంటారు. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల మీ చర్మం, జుట్టు, కీళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది చర్మంపై గాయాలు, మచ్చలకు కూడా దారితీస్తుంది.

2. స్కర్వి

స్కర్వి అనేది విటమిన్ సి లోపంతో వచ్చే ప్రధాన సమస్య. ఇది గాయాలు, చిగుళ్ళ నుండి రక్తస్రావం, బలహీనత, అలసట, దద్దుర్లు వంటి వాటికి దారితీస్తుంది. మరోవైపు, అలసట, ఆకలి తగ్గడం, చిరాకు, కీళ్ల నొప్పులకు కూడా కారణమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది రక్తహీనత, చిగురువాపు, చర్మపు రక్తస్రావం మొదలైన వాటికి కూడా దారితీస్తుందని వైద్యులు సూచించారు.

3. ఎనీమియా

విటమిన్ సి లోపం వల్ల ఎనీమియా లేదా రక్తహీనత వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.. అందుకే ఆహారంలో విటమిన్ సి చేర్చడం చాలా ముఖ్యం. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా లేదా నాణ్యత తగ్గినా ఎనీమియాగా గుర్తిస్తారు. దీని వల్ల అలసట, పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం, మైకం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

4. హైపర్ థైరాయిడిజం

థైరాయిడ్ గ్రంథి అధిక హార్మోన్లను స్రవించడాన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ ఆరోగ్యానికి విటమిన్ సి చాలా కీలకం. విటమిన్ సి లోపం వల్ల థైరాయిడ్ గ్రంథుల నుండి హార్మోన్లు అధికంగా స్రవించి, హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది. తద్వారా అనుకోకుండా బరువు తగ్గడం, గుండె దడ, ఆకలి పెరగడం, భయపడటం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటివి సమస్యలు వస్తాయి.

మరి ఈ లోపం నివారించేది ఎలా

విటమిన్ సి లోపం ద్వారా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టేందుకు మీ రోజువారీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను చేర్చండి. సిట్రస్ పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం చేసేవారి శరీరంలో విటమిన్ సి తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ధూమపానం చేసే అలవాటు ఉంటే మానేయండి మంచిది. అది అయ్యేపనికాదంటారా..కనీసం తగ్గించటానికి ప్రయత్నించండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమైన మార్గం.

Read more RELATED
Recommended to you

Latest news