రోజూ రెండు సార్లు సోంపు గింజల‌ను తింటే డయాబెటిస్ తగ్గుతుందట..!

-

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి బారినపడి ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.

ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను చూశాక ఎవరైనా కడుపు నిండేలా తింటారు. దీంతో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు వారు ర‌క‌రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. వాటిలో ఒకటి సోంపును తినడం. భోజనం చేసిన వెంటనే సోంపును తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఆహారం త్వరగా జీర్ణమవుతుంద‌ని చెప్పి సోంపు తింటుంటారు. అయితే కేవలం అందుకోసమే కాక డయాబెటిస్ ను తగ్గించడం కోసం కూడా సోంపు గింజలు పనిచేస్తాయ‌ని సైంటిస్టులు చేపట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి బారినపడి ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే అన్నింటిలోకెల్లా సోంపు గింజలను తినడం ఉత్తమమైన మార్గమ‌ని వైద్యులు చెబుతున్నారు. సోంపు గింజల‌లో ఉండే విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు, అలాగే క్లోరోజెనిక్ యాసిడ్‌, లైమొనెన్‌, క్వ‌ర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ రాకుండా చూస్తాయ‌ని పరిశోధనల్లో వెల్లడైంది. అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడే వారు నిత్యం రెండుసార్లు భోజనం అనంతరం సోంపు గింజలు తింటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. సోంపు గింజలు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంద‌ని ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల‌లో తేలింది.

సోంపు గింజల‌ను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని, దీంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. సోంపులో ఉండే బీటా కెరోటిన్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే సోంపులో క్యాన్సర్ ను రాకుండా చూసే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే క్యాన్సర్ పూర్తిగా అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉన్నవారు మాత్రం సోంపు తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. సోంపు గింజలతో డ‌యాబెటిస్‌, అధిక బరువుల‌ను తగ్గించుకోవాలంటే నిత్యం వాటిని రెండు పూటలా తినడం లేదా, వాటిని పొడి రూపంలో తీసుకుంటే చాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే గర్భంతో ఉన్నవారు, బాలింతలు సోంపు గింజల‌ను తినవద్దని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news