హెయిర్ కెరాటిన్ చికిత్స చేయిస్తున్నారా..? అయితే ఓసారి ఈ నష్టాల గురించి చూడండి..!

-

ఒకప్పుడు జుట్టు నల్లగా పొడవుగా పెంచుకోవడానికి అమ్మాయులు ఇష్టపడేవారు..కానీ ఎప్పుడు చాలామంది అమ్మాయిలు అంతంత పొడవు జుట్టును పెంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒక మీడియం సైజు వరకూ ఉంటే చాలు..మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఇంకా వాటికి హైలెట్స్ కూడా..కొందరు ముందు వరకూ వెయించుకుంటే..మరికొందరూ జుట్టు అంతా మెరిసేలా చేయించుకుంటున్నారు. మెరిసే, నునుపైన జుట్టు పొందడానికి కెరాటిన్ చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మన జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారైంది. కెరాటిన్ ట్రీట్‌మెంట్ అంటే ఈ రకమైన ప్రొటీన్‌తో కూడిన క్రీములతో జుట్టుకు చికిత్స చేయడం.
ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసే, సిల్కీగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పాడవ్వకుండా చేస్తుంది. రైజోమ్‌లోని ఖాళీలను పూరించడానికి కూడా ఇది ఉపయోగిస్తారు. కానీ కెరాటిన్ చికిత్స తర్వాత షాంపూ, కండీషనర్, ఇతర జుట్టు ఉత్పత్తులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ జుట్టుకు అదనపు శ్రద్ధ, శ్రమ అవసరం. ఇంతకుమందుు వాడినట్లు ఏదిపడితే అది వాడకూడదు. కెరాటిన్ చికిత్స అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ఇది ఇతర చికిత్సల మాదిరిగానే కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అవి ఏంటో చూదాం

జుట్టు రాలడం:

దీనివల్ల కలిగే అతిపెద్ద నష్టం ఏంటంటే..జుట్టు రాలడమే..ప్రత్యేకించి మీరు ఈ చికిత్సను తరచుగా తీసుకుంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉన్నప్పుడు కెరాటిన్ ట్రీట్ మెంట్ తీసుకోకూడదని, ఏడాదికి ఒక్కసారే ఎక్కువ చేయకూడదని హెయిర్ అండ్ కాస్మోటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ ప్రమాదం:

కెరాటిన్ చికిత్స సమయంలో ఫార్మాల్డిహైడ్ ఉన్న కొన్ని క్రీములను ఉపయోగించడం వల్ల కంటి చికాకు, గొంతు నొప్పి, దురద, జుట్టు దెబ్బతినడంతో క్యాన్సర్‌కు కారణం కావచ్చట. ఫార్మాల్డిహైడ్ రసాయనాల వాడకం కార్సినోమాకు దారి తీస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. కాలక్రమేణా, జుట్టు నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఈ చికిత్స ఖర్చు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది చాలా తక్కువ రోజులు మాత్రమే జుట్టును మెరిసేలా చేస్తుంది.

జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు:

కెరాటిన్ చికిత్స మీ జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ ట్రీట్ మెంట్ వల్ల జుట్టు నిగనిగలాడేలా, మృదువుగా మార్చవచ్చు. అయితే ఇది కొంత హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెరాటిన్ చికిత్స కోసం పెద్ద మొత్తంలో జోడించిన రసాయనాలు మూలాల వరకు చొచ్చుకొనిపోయి జుట్టును బలహీనపరుస్తాయట.
హెయిర్ డ్యామేజ్:
కెరాటిన్ చికిత్స సమయంలో ఫార్మాల్డిహైడ్ ,అధిక వేడిని ఉపయోగించడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు నష్టం జరుగుతుంది. అలాగే ఈ ట్రీట్ మెంట్ కు వాడే క్రీముల్లోని రసాయనాలు సహజసిద్ధమైన తేమను పీల్చుకుంటాయి.. కాబట్టి కాలక్రమేణా, జుట్టు నిస్తేజంగా ,పొడిగా మారుతుంది.
లాభాలు ఎన్ని ఉన్నాయో..నష్టాలు కూడా అలానే ఉన్నాయి..చికిత్స అనంతంర తగిన జాగ్రత్తలు తీసుకుంటే..ఈ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news