అంగస్తంభన సమస్యలకి యోగాసనాలు..!

-

అంగస్తంభన సమస్యలని పోగొట్టడానికి యోగ బాగా ఉపయోగపడుతుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆసనాలని మనం ఇప్పుడు చూద్దాం.

 

seated forward bend aka paschimottanasana:

అంగస్తంభన సమస్యను అధిగమించడానికి ఉత్తమమైన యోగా ఆసనాలలో ఇది ఒకటి. ఈ ఆసనం వేయడం వలన పెల్విక్ మజిల్స్ రిలాక్స్ గా ఉంటాయి. అంగస్తంభన సమస్యను అధిగమించడానికి ఈ ఆసనం చాల మంచిది. నీరసం, ఒత్తిడి, జీర్ణ సమస్యలని కూడ ఇది పోగొడుతుంది.

ఆసనం వేసే పద్దతి:

మీ కాళ్ళు ముందుకి పెట్టి నేలమీద కూర్చోండి.
మీ చేతులను నేరుగా పైకి ఎత్తండి.
ఇప్పుడు మీ చేతులను చాచి మీ శరీరాన్ని మీ కాలి వైపుకు వంచండి.
మీ వెన్నెముకను మాత్రం నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి.
కొన్ని సెకన్ల పాటు ఈ పొజీషన్ లో వుండండి.
ఇప్పుడు మీ యధాస్థానానికి వెళ్లిపోండి.
రిపీట్ చేయండి.

plank pose aka kumbhakasana:

దీనిని ప్లాంక్ పోజ్ అని కూడా అంటారు. అంగస్తంభన సమస్యను అధిగమించడానికి అత్యంత ప్రభావవంతమైన యోగా ఆసనాలలో ఒకటి. శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఈ ఆసనం వలన మరెన్నో ఉపయోగాలు వున్నాయి.

ఆసనం వేసే పద్దతి:

మీ వెనుకభాగం సీలింగ్ వైపు ఉండేలా నేలపై పడుకోండి.
ఇప్పుడు మీరు మీ అరచేతులను మీ భుజాలకు అనుగుణంగా నేలపై ఉంచండి.
మీ శరీరం అంతా తిన్నగా ఉండేలా చూడండి.
మీకు వీలైనంత వరకు ఈ పొజీషన్ లో వుండండి.

Boat pose aka Naukasana:

దీనిని ఎక్కువగా బోట్ పోజ్ అంటారు. సెక్సువల్ ఎనర్జీని ఇది బూస్ట్ చేస్తుంది. ఇక ఈ ఆసనం వేసే పద్దతి గురించి కూడా చూసేద్దాం.

ఆసనం వేసే పద్దతి:

ముందు నేలపై పడుకోండి.
ఇప్పుడు మీ చేతులను కిందకి ఉంచండి.
మీ ఛాతీ మరియు కాళ్ళను ఎత్తి గాలిలో ఉంచండి.
మీ వెన్నెముకను మాత్రం నిటారుగా ఉంచండి.
కొన్ని సెకన్ల పాటు ఈ పొజీషన్ లో వుండండి.
ఫైనల్ గా మీ యధాస్థానానికి వెళ్ళండి.
దీనినే రిపీట్ చెయ్యండి.

Baddha Konasana:

ఇది కూడా మీ యొక్క సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇక ఈ ఆసనం ఎలా వెయ్యాలి అనేది చూస్తే..

ఆసనం వేసే పద్దతి:

ముందు నేలపై కూర్చోండి.
మీ మోకాళ్ళను 90 డిగ్రీల వద్ద ఉంచి, మీ పాదాలలని కూడా కింద ఉంచండి.
మీ చేతులను మీ వెనుక వెనుక ఉంచండి.
మీ కాళ్ళను పైకి క్రిందికి కదిలించండి (ఫ్లాపింగ్ వంటిది).
ఆ తర్వాత మీ యధాస్థానానికి వెళ్ళండి.
దీనినే రిపీట్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news